- కొనియాడిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
- సీఎం యోగిని లక్నోలో కలిసిన మంత్రి నారాయణ
లక్నో (చైతన్యరథం): ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కొనియాడారు. ఘనవ్యర్థాల ప్లాంట్ల అధ్యయనం కోసం ఉత్తరప్రదేశ్ వెళ్లిన మంత్రి నారాయణ మంగళవారం ఆ రాష్ట్ర రాజధాని లక్నోలోని కాళిదాస్ మార్గ్‌లో ఉన్న యూపీ సీఎం నివాసంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తొలుత మంత్రి నారాయణ బృందం క్షేత్రస్థాయిలో పర్యటించింది. అనంతరం యూపీ సీఎం, అధికారులతో భేటీ అయింది. ఉత్తరప్రదేశ్‌లో ఘన వ్యర్థాల నిర్వహణ తీరుతెన్నులను ఆ రాష్ట్ర అధికారులు వివరించారు. ఏపీలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం ఉపయోగిస్తున్న పద్ధతులను సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు మంత్రి నారాయణ, ఏపీ అధికారులు వివరించారు. ఏపీలో అనుసరిస్తున్న పద్ధతులను పరిశీలించేందుకు రావాలని యూపీ అధికారులను మంత్రి నారాయణ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రశంసలు కురిపించారు. సీఎం చంద్రబాబు మంచి విజన్ ఉన్న నాయకుడని కొనియాడారు.
`