నయ వంచకుడు జగన్‌రెడ్డికి అబద్ధాలు లేకపోతే రాజకీయ బతుకులేదు. అధికారంలోకి వచ్చి ఏడాదికాకముందే `ఐదేళ్ల విధ్వంస రాష్ట్రాన్ని గాడిన పెట్టిన చంద్రబాబు పాలనపై అవాకులు చవాకులు మాట్లాడుతూనే ఉన్నాడు. ఐదేళ్లలో ఆయన చేసిన పాపాల దోపిడీని చంద్రబాబు పాలనకు ఆపాదించే పచ్చి అబద్ధాల ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉన్నాడు. ఎన్నికలకు ముందు జగన్ చెప్పిన పచ్చి అబద్ధాలకు జనం కర్రు కాల్చి వాత పెట్టారు. అయినా ఆయనకు జ్ఞానోదయం కలగడం లేదు. చంద్రబాబు ఏడాది పాలనలో చేసిన అప్పుల్ని జగన్ ఐదేళ్ల పాలనతో పోల్చి చెప్పడం గురివింద సామెతను గుర్తు చేస్తుంది. అనుభవజ్ఞుడైన చంద్రబాబుతో పోల్చి చెప్పుకునే నైతిక అర్హత జగన్‌కు ఏముందన్నది అసలు ప్రశ్న. ఆర్థిక క్రమశిక్షణలో ఒకప్పుడు దేశానికే ఆదర్శంగా నిలిచిన రాష్ట్రాన్ని ఐదేళ్లలో పాలనలో అప్పుల కుప్పగా మార్చిన ఘనత జగన్‌ది. ఆంధ్ర ప్రజలపై పది లక్షల కోట్లకు పైగా అప్పుల కుప్పపెట్టిన జగన్.. ఎక్కడ దొరికితే అక్కడ, ఏది కావాలంటే అది తాకట్టుపెట్టి మరీ రాష్ట్ర భవిష్యత్తును అప్పుల అగాధంలోకి నెట్టిన విషయం చరిత్ర ఎప్పటికీ మరువదు. జీఎస్‌డీపీలో 35శాతం అప్పు మించకూడదన్న ఆర్థిక నిబంధనను తుంగలోతొక్కి.. 42శాతం దాటించిన జగన్ పనితనానికి కాగ్ పెట్టిన చివాట్లు అందరికీ తెలుసు.
అనధికారిక అప్పులు కూడా కలిపితే రుణాలు 65శాతం దాటిపోయిన దారుణ పరిస్థితులు ప్రజలందరికీ తెలిసిందే. బహిరంగ మార్కెట్ రుణం, కేంద్రంనుంచి వచ్చే రుణాలు, ప్రావిడెంట్ ఫండ్ మొత్తాలు.. ఇలా బయటికి కనిపించేవి కాగా, అసలు ఎవరికీ చెప్పకుండా ప్రభుత్వ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వమే గ్యారంటీలు ఇచ్చి తెచ్చిన రుణాలు మరో ఎత్తు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పులపై నానా యాగీ చేసిన జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుల కోసం ప్రభుత్వ గ్యారంటీల పరిమితిని రెట్టింపు చేశారు. ఏటా ఆర్థిక సంవత్సరంలో సాధించిన పూర్తి రెవెన్యూ రాబడిలో 90శాతం వరకు ప్రభుత్వ గ్యారంటీల మొత్తం ఉండాలనే నిబంధన ఉండేది. దానిని 180 శాతానికి పెంచింది జగన్‌రెడ్డి కాదా? ఏపీని జగన్ ముఠా దివాలా అంచులకు ఈడ్చి ఆర్థిక క్రమశిక్షణకు సమాధి కట్టలేదా? ఆ దరిద్రాన్ని ఉద్దేశపూర్వంగా విస్మరించి.. బాబు ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేయడం జగన్‌కే సాధ్యం!
చంద్రబాబు పాలనలో సంక్షేమం ఊసే లేదన్నది జగన్ చేస్తోన్న దుష్ప్రచారం. నవరత్నాలతో నిలువునా ముంచిన భ్రష్ట చరిత్ర జగన్‌దే. చంద్రబాబు మునుపటి ప్రభుత్వంలో తెచ్చిన పథకాలకు పాతరేసి.. అవే వైసీపీ నవరత్నాలుగా వదిలిన దుర్మార్గుడు జగన్. రైతు కుటుంబాలకు పెట్టుబడి సాయంగా ఏటా రూ.12,500 ఇస్తానన్న జగన్ -పీఎం కిసాన్ యోజన మొత్తం రూ.6000 అందులో కలిపేసి వంచనకు పాల్పడిరది నిజంకాదా? పగటిపూటే తొమ్మిది గంటల ఉచిత కరెంటు, రూ.3000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.4000కోట్లతో విపత్తుల సహాయక నిధి అంటూ బూటకపు వాగ్దానాలతో మోసాలకు పాల్పడలేదా? ఇచ్చిన వాగ్దానాల మేరకు -శీతల గిడ్డంగులు లేవు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కనిపించలేదు. భవిష్యత్తుపై రైతుకు భరోసా లేకుండా చేసిన జగన్ -చివరకు ఆరోగ్యశ్రీని అస్వస్థతకు గురిచేసి అనారోగ్య పీడితుల్నీ వంచించాడు. చికిత్స వ్యయ పరిమితిని రూ.25 లక్షలకు పెంచామని గొప్పలు చెప్పుకుని.. ఆస్పత్రులకు బిల్లులు బకాయిపెట్టి ఆరోగ్యశ్రీని ముంచేశాడు. ‘విద్యాదీవెన’ అంటూ ఆర్బాటం చేసి పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిరది జగన్ సర్కారు. చేయూత ఇస్తానని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు మోచెయ్యి చూపించాడు. చదువుతోనే సామాజిక హోదా, ఆర్థిక ప్రగతి అంటూ అల్లిబిల్లి కబుర్లు చెప్పి విద్యార్థుల రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెట్టాడు. పేద కుటుంబాలు నెత్తిన రూ.3000 కోట్లు భారం మోపాడు. మద్యపాన నియంత్రణ సాకుతో లిక్కరు ధరలకు రెక్కలు తొడిగి, అడ్డమైన బ్రాండ్లనూ జనం మీదకు వదిలిన జగన్.. వేలాది ప్రాణాలకు మరణ శాసనం రాసిందీ జగనే. నాసిరకం మద్యం నిరుపేదల్ని బలిగొంటుంటే, ఆ శవాలమీద కాసుల పేలాలు ఏరుకున్నదీ జగనే. విషపూరితమైన జె బ్రాండ్ మద్యంతో ప్రజారోగ్యాన్ని పొట్టన పెట్టుకున్నాడు. ఏపీని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చేశాడు. జగనన్న కాలనీలనూ నీరుగార్చేసి.. పేదల సొంతింటి కలల్ని నిలువునా తుంచేశాడు. దాదాపు రూ.51,000 కోట్లతో 17వేల జగనన్న కాలనీల్లో 28,38,227 గృహాల్ని రెండు దశల్లో నిర్మిస్తామంటూ చేసిన ఆర్బాటం.. క్షేత్రస్థాయిలో అడ్రెస్ లేకుండా పోయింది.
తెదేపా హయాములో దాదాపు పూర్తైన టిడ్కో ఇళ్లనూ పాడుపెట్టి బూత్ బంగ్లాలుగా మార్చేసిన నీచ చరిత్ర జగన్‌రెడ్డిది. పనికి మాలిన పథకాలను నవరత్నాలుగా బులిపించి, జనాన్ని పిచ్చోళ్లలా జమకట్టి లబ్దిదారులంతా మళ్లీ తనకే ఓటెయ్యాలన్న డ్రామాల జగన్ కపటాన్ని ప్రజలు గుర్తించారు కనుకే.. పాతాళంలోకి తొక్కేశారు. అలాంటి నువ్వా జగన్‌రెడ్డీ.. చంద్రబాబు సంక్షేమ పాలనపై వ్యాఖ్యలు చేసిది?
మంచి పరిపాలన అందిస్తానంటూ ఊరూవాడా ఊదరగొట్టి 2019 ఎన్నికల్లో గెలిచిన జగన్- రోడ్డు వేయలేదు. పరిశ్రమలను తీసుకురాలేదు. యువతకు ఉపాధి చూపించలేదు. రైతులకు సాగునీరు ఇవ్వలేదు. దళితులూ గిరిజనులకు కనీస భద్రత కల్పించలేదు. ఏపీని అన్నిరంగాల్లో కటిక చీకట్లలోకి నెట్టిన చరిత్ర జగన్‌దే. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని హతమార్చిన జగన్ పార్టీని ఏపీ ప్రజలు అధఃపాతాళానికి తొక్కేశారు! రాక్షసత్వంలో జగన్‌రెడ్డికి సరిజోడులై, తోడుదొంగలై ఏపీని పీల్చి పిప్పిచేసిన వైకాపాసురులపై ఆంధ్ర ప్రజానీకం కసితీరా వేటేసింది. మా వెంట్రుక కూడా పీకలేరని విర్రవీగిన జగన్‌పై ఆగ్రహంతో రగిలి పోయిన ప్రజలు, జగన్ నెత్తిమీద పదకొండు వెంట్రుకలనే ఉంచి మిగతావి పీకి కుప్పలు పెట్టారు.
తానేదో రాష్ట్రం కోసం జీవితాన్ని ధారపోసినట్లు నక్క వినయాలు ప్రదర్శిస్తే.. మళ్లీ ప్రజలు నమ్ముతారని అనుకోవడం అతని భ్రమ. జనాన్ని పీడిరచి జనం చేతిలో చావుదెబ్బ తిన్న తరువాత కూడా జగన్‌లో మార్పు రావడం లేదు. ప్రతిపక్ష హోదా కూడా దక్కనంతగా ప్రజలు తిరస్కరించినా తన బుద్ది మార్చుకోవడం లేదు. రాజకీయ ప్రయోజనాల కోసం మీడియా వ్యవస్థను ఏర్పాటుచేసి.. ఇతర గిట్టని మీడియా వ్యవస్థలమీద విషం కక్కడానికి ఇంగితం ఉండాలి. చేతిలో రోత పేపర్ ఉందని ఏదిబడితే అది తెలుగుదేశానికి ఆపాదించి విషం గక్కినంత మాత్రాన `ప్రజలు నమ్ముతారని అనుకోవడం కల్ల. పత్రికా విలువలకు తిలోదకాలిచ్చి అవినీతి పుత్రిక సాక్షిలో అరాచక రాతలు రాయడానికి సిగ్గు లేదూ. దీనికి మీరు ఏం సమాధనమిస్తారు జగన్ రెడ్డి!
`నీరుకొండ ప్రసాద్