అమరావతి (చైతన్య రథం): బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్తగా అభివృద్ధి చేసిన టెర్మినల్ 2ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. ఈమేరకు ‘ఎక్స్’ వేదిపై పోస్టు పెడుతూ.. ‘కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో టెర్మినల్ 2ను సందర్శించిన సందర్భంలో.. విమానాశ్రయ సీఈవో హరిమారర్‌తో కొద్దిసేపు ముచ్చటించాను. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులకు అందుబాటులోవున్న సౌకర్యాలను అర్థం చేసుకుని.. అవగాహన పెంచుకోవడానికి అధికారులు, ప్రయాణీకులతోనూ సంభాషించడం ఆనందంగా అనిపించింది. సహజ వాతావరణం మధ్య టెర్నినల్ 2ను అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేశారు.
నిజంగా ఆకట్టుకుంటుంది. విమానాశ్రయంలో సహజ ఉద్యానవనాన్ని ఏకీకృతం చేయడం ఆకర్షణీయంగా అనిపించింది. విమానాశ్రయాన్ని మల్టీమోడల్ ట్రాన్సిట్ హబ్‌గా, సౌకర్యాలు మరియు పర్యావరణ అనుకూల వాతావరణంతో రూపొందించడం ప్రశంసనీయం. విమానాశ్రయంలోని కార్యాచరణ అంశాలు, ఇతర సౌకర్యాలను అర్థం చేసుకోవడానికి నేను జరిపిన చర్చలు భవిష్యత్‌లో ఉపయోగపడేవే. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచస్థాయి విమానాశ్రయాలు అభివృద్ధి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్న నేపథ్యంలో.. నేటి సందర్శనలో తెలుసుకున్న కీలకమైన విషయాలు ఉపయుక్తమేనన్న సానుభూల భావన నాకు కలుగుతోంది’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.