- నేడు శంకుస్థాపన చేయనున్న జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత
కడప (చైతన్యరథం): పారిశ్రామిక ప్రగతికి, యువతలో ఆవిష్కరణకు, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి దోహదపడేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించబడిన ‘‘స్టార్టప్ కడప ఎంట్రప్రెన్యూర్‌షిప్ సెంటర్’’ నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన జరగనుంది. కడప ఆర్ట్స్ కాలేజ్ సమీపంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత ఈ కేంద్రానికి శంకుస్థాపన చేయనున్నారని కడప జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కేంద్రం యువ స్టార్టప్ వ్యవస్థాపకులు, ఫ్రీలాన్సర్లు, చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థల అభివృద్ధికి పునాది వేస్తూ, కడపను వ్యాపార అవకాశాల కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా కీలక పాత్ర పోషించనుంది. దేశ, విదేశాల్లో స్థిరపడిన కడప జిల్లా వాసుల సహకారంతో, వారిని అనుసంధానం చేసుకుని ఈ స్టార్ట్ అప్ హబ్‌ను ముందుకు తీసుకువెళ్తామన్నారు.
ప్రాజెక్ట్ లక్ష్యాలు:
స్టార్టప్ కడప కేంద్రాన్ని ఆవిష్కరణను ప్రోత్సహించడమే కాక, ఆలోచనల నుంచి అభివృద్ధి చెందిన వ్యాపారాల వరకు అన్ని దశల్లో స్టార్టప్‌లకు మద్దతు అందించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచ స్థాయి మౌళిక సదుపాయాలు, వృత్తిపరమైన వర్క్‌స్పేస్‌లు, సహకార వాతావరణం వంటి అంశాలతో యువతకు అవసరమైన అన్ని వనరులు ఈ కేంద్రం అందించనుంది.
నిర్మాణ వివరాలు:
జీ ప్లస్ 3 అంతస్తులు, 25,000 చదరపు అడుగుల విస్తీర్ణం
పీఈబీ టెక్నాలజీ ఆధారంగా నిర్మాణం
పార్కింగ్ మరియు ప్రవేశ వసతులు: 25`30 కార్లకు పార్కింగ్, ద్విచక్ర వాహనాల కోసం ప్రత్యేక స్థలాలు
ల్యాండ్‌స్కేప్డ్ డ్రైవ్‌వే, లాబీ
భవన వినియోగ ప్రణాళిక (ఖీశ్రీశీశీతీ -షఱంవ ఖీవa్‌బతీవం)
గ్రౌండ్ ఫ్లోర్: డబుల్ హైట్ లాబీ, రిసెప్షన్, వేచి ఉండే ప్రదేశం, 200 సీట్ల ఆడిటోరియం, క్యాఫెటీరియా
మొదటి అంతస్తు: కాన్ఫరెన్స్ హాల్స్, మీటింగ్ రూములు, శిక్షణ గదులు
రెండవ, మూడవ అంతస్తులు: ఓపెన్ వర్క్‌స్టేషన్లు, ప్రైవేట్ గ్లాస్ కేబిన్లు, ఐడియా పాడ్లు, ఇన్‌ఫార్మల్ లాంజ్‌లు, బ్రేక్‌ఔట్ జోన్లు
మౌలిక సదుపాయాలు:
ట్విన్ లిఫ్ట్ కోర్, ఎనర్జీ ఎఫిషియెంట్ నహూజ
సోలార్ రూఫ్‌కు అనుకూలత
వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ
పచ్చదనం, నీడలతో కూడిన వాక్‌వేలు, సురక్షిత సైట్ అభివృద్ధి
ప్రాజెక్ట్ మొత్తం వ్యయం:
ఈ ప్రాజెక్టును రూ. 10 కోట్లు అంచనా వ్యయంతో చేపడుతున్నారు. షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ సంస్థ రూ.4 కోట్లు విరాళం అందించింది. ఇందులో సివిల్ నిర్మాణం, ఫినిషింగ్ పనులు, నహూజ, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ వ్యవస్థలు, సైట్ అభివృద్ధి వ్యయాలు ఉన్నాయి.
‘‘స్టార్టప్ కడప’’ కేవలం ఒక భవనం మాత్రమే కాదు. ఇది యువత కలలకు రూపురేఖలు ఇచ్చే వేదిక. ఆవిష్కరణ, ఆధునికత, అభివృద్ధికి దిక్సూచిగా ఇది నిలవనుంది. కడపను పారిశ్రామిక, సాంకేతిక దిశలో ముందుకు నడిపించేందుకు ఇది ఒక మంచి ప్రాజెక్ట్ అని జిల్లా కలెక్టర్ తెలిపారు.
““