అమరావతి (చైతన్యరథం): గుజరాత్‌లోని వడోదరలో ఇటీవల జరిగిన జాతీయస్థాయి మాస్టర్ స్పెల్లర్ పోటీల్లో ఉత్తమ అవార్డును కైవసం చేసుకున్న అత్తోట హార్డీకి విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేశారు. గుంటూరు జిల్లా కొల్లూరుకు చెందిన హార్డీ పిన్నవయసులో అసాధారణమైన స్పెల్లింగ్ నైపుణ్యాలు, స్పష్టత, విభిన్నమైన సవాళ్లను ఎదుర్కోవడంలో ప్రతిభను చాటారని ప్రశంసించారు. చిరంజీవి హార్డీ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అందుకోవాలని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు.