1.జగన్ పాలనలో మద్యం రోగుల సంఖ్య, మద్యం మరణాలు గతం కన్నా రెట్టింపు ఎందుకు పెరిగాయి?నాసిరకం మద్యం వల్ల కాదా?
2. మద్యం పాలసీ నిర్ణయించడానికి ప్రైవేటు భవనాల్లో జగన్ ముఠా ఎందుకు దొంగ చాటు సమావేశాలు జరిపారు? దొంగచాటు సమావేశాలు జరిపింది కమీషన్ల కోసం కాదా?
3. కమీషన్లు ఇవ్వలేదనే కదా ఇంటర్నేషనల్ బ్రాండ్లకు సరఫరా ఆర్డర్లు నిరాకరించింది?
4. కమీషన్లు ఇచ్చినందుకే కదా నాసిరకం బ్రాండ్లు అనుమతించింది?
5. కమీషన్ల కోసం కాదా నాసిరకం మద్యం ధరలు రెట్టింపు చేసి పెంచింది?
6. కమీషన్ల కోసమే కదా డిజిటల్ పేమెంట్స్ కాకుండా నగదు చెల్లింపుల ద్వారా అమ్మకాలు చేసింది?
7. కమీషన్లు రూ.3,200 కోట్లకు సిట్ ఆధారాలు సేకరించినందుకే కదా ఈడీ కేసు నమోదు చేసింది?
8. కమీషన్లకు ప్రాథమిక ఆధారాలు ఉన్నందునే కదా సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది.
9. జగన్ కోటరీలో ఉన్న ధనుంజయరెడ్డి, కె.నాగేశ్వరరెడ్డి, బాలాజీ గోవిందప్ప, మిథున్‌రెడ్డి మద్యం కుంభకోణంలో ఉన్నారంటే దానికి బాధ్యత జగన్‌ది కాదా?
10. వేల కోట్ల మద్యం కుంభకోణం మాజీ సీఎం జగన్ ప్రమేయం లేకుండా ఎలా జరుగుతుంది?
11. మద్యం కుంభకోణంలో ప్రధాన లబ్ధిదారు జగన్ కాబట్టే కదా నిందితులను సాక్షి మీడియా నిస్సిగ్గుగా వెనకేసుకొస్తున్నది?
12. సాధారణ ఉద్యోగి కె.నాగేశ్వరరెడ్డి కుమారుడికి అన్ని కంపెనీలు అంత వేగంగా ఎలా పెట్టగలరు?
13. ఆనాడు గాలి జనార్దనరెడ్డిని సమర్థించిన సాక్షి మీడియా నేడు కోర్టు తీర్పును తప్పు పట్టగలదా?
14. జగన్ దోపిడీని చంద్రబాబుకు అంటగట్టి రాసిన అబద్ధమే వందసార్లు సాక్షిలో రాస్తే దాన్ని నమ్మడానికి రాష్ట్ర ప్రజలకు తెలివిలేదని భావిస్తున్నారా?
15. చంద్రబాబుపై జగన్, ఆయన తండ్రి పెట్టిన కేసులకు ఒక్క దానికి కూడా ఎందుకు ఆధారాలు చూపలేకపోయారు?
16. జగన్‌తో పాటు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, పారిశ్రామిక వేత్తలు పెద్దసంఖ్యలో ఎందుకు జైళ్ల పాలయ్యారు?
గురజాల మాల్యాద్రి,
చైర్మన్, టీడీపీ నాలెడ్జ్ సెంటర్