- పార్టీ నేతల ఫొటోలు, బ్యానర్లు వద్దు
- కేవలం జాతీయ పతాకం మాత్రమే కనిపించాలి
- పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా పిలుపు
అమరావతి (చైతన్యరథం): ఆపరేషన్ సిందూర్ విజయాన్ని పురస్కరించుకొని, భారత సాయుధ దళాల పట్ల పౌరుల కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరచే రాజకీయేతర ఉద్యమంగా దేశవ్యాప్తంగా చేపడుతున్న తిరంగ యాత్రను ఆంధ్రప్రదేశ్‌లో విజయవంతం చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గురువారం ఆయన రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు, జిల్లాల అధ్యక్షులు, విభాగ ఇన్‌ఛార్జులు, యువత, మహిళా నేతలు, పార్టీ కార్యకర్తలతో ప్రత్యేక టెలికాన్ఫరెన్స్ నిర్వహించి యాత్రకు సంబంధించి కీలక మార్గదర్శకాలను వెల్లడిరచారు. ఈ యాత్ర పూర్తిగా రాజకీయేతరమైనదని పల్లా స్పష్టం చేశారు. ఎలాంటి పార్టీ చిహ్నాలు, నాయకుల ఫొటోలు, బ్యానర్లు, బ్రాండిరగ్ లేకుండా కేవలం జాతీయ పతాకంతోనే యాత్ర నిర్వహించాలన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల పట్ల గౌరవాన్ని వ్యక్తపరిచే విధంగా ఈ కార్యక్రమం కొనసాగాన్నారు.
ప్రజల భాగస్వామ్యంతో..
ప్రతి నియోజకవర్గం, మండల స్థాయిలో స్థానిక ప్రజల భాగస్వామ్యంతో యాత్రను సమ్మిళితంగా, శాంతియుతంగా, క్రమశిక్షణతో నిర్వహించాలని పల్లా పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త, నాయకుడు ఇందులో పూర్తిగా భాగస్వామిగా ఉండాలని అన్నారు. భారత సైనికుల సేవలను గౌరవించేందుకు ప్రతి ఒక్కరూ ఈ యాత్రలో చురుకుగా పాల్గొని దేశభక్తిని చాటాలని పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.