అమరావతి (చైతన్య రథం): టెస్టు క్రికెట్‌కు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వీడ్కోలు పలకడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. విరాట్ నాయకత్వ లక్షణాలు లక్షలమందికి స్ఫూర్తినిచ్చాయని కొనియాడారు. మిగతా ఫార్మాట్లలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ‘అద్భుత అధ్యాయం ముగిసింది’ అంటూ చంద్రబాబు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ‘టెస్టు క్రికెట్ నుంచి విరాట్ కోహ్లి రిటైర్మెంట్‌తో భారత క్రీడా చరిత్రలో ఓ అద్భుత అధ్యాయం ముగిసింది. క్రికెట్‌లో అతడి అభిరుచి, క్రమశిక్షణ చాలామందిలో స్ఫూర్తినింపాయి. విరాట్ కోహ్లి దేశానికే గర్వకారణం. అతడి తదుపరి ప్రయాణం.. విజయపథంలో సాగాలని ఆకాంక్షిస్తున్నా’ అని పేర్కొన్నారు.