- చిన్న వయసులోనే మరణం బాధాకరం
- వ్యక్తిగతంగా రూ.25 లక్షలు ప్రకటిస్తున్నా
- ఎప్పుడు ఏ అవసరమొచ్చినా సిద్ధంగా ఉన్నా
- ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ వెల్లడి
- మురళీనాయక్ అంత్యక్రియలకు హాజరు
గోరంట్ల(చైతన్యరథం): మన దేశం ఎప్పుడూ యుద్ధం కావాలని కోరుకోలేదు.. పొరుగు దేశాల మీద యుద్ధాలు చేసింది లేదు..మనల్ని మనం సంరక్షించుకోవడానికి తప్పని పరిస్థితుల్లో యుద్ధం చేస్తున్నాం..పాకిస్థానే ఈ పరిస్థితికి కారణమని ఉపముఖ్య మంత్రి పవన్‌కళ్యాణ్ అన్నారు. కాళ్ల బేరానికి వచ్చి కాల్పుల విరమణ ప్రకటించిన మూడు గంటల్లోనే పాకిస్థాన్ ఒప్పందాన్ని ఉల్లంఘించి తోక జాడిరచిందన్నారు. ఆపరేష న్ సిందూర్‌లో వీర మరణం పొందిన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితం డాకు చెందిన అమర జవాన్ మురళీనాయక్ భౌతికకాయానికి నివాళులర్పించి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. మురళీనాయక్ తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరాం నాయక్‌లను ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చిన్న వయసులో యుద్ధంలో ప్రాణా లు కోల్పోవడం బాధాకరమన్నారు. మురళీ నాయక్ తన అభిమాని అని తెలిసి చాలా బాధ కలిగింది. నాయక్ అందరికంటే దేశాన్ని ప్రేమించే వ్యక్తి. వారి కుటుంబానికి ప్రగా ఢ సానుభూతి తెలియజేస్తున్నాను. జోహార్ మురళీనాయక్ అంటూ నినదించారు. అగ్నివీర్‌గా 2022లో విధుల్లో చేరిన నాయక్(23) రైల్వే ఉద్యోగం వచ్చినా కాదనుకుని దేశం కోసం పనిచేయాలనుకున్నాడు. అవసరమైతే దేశం కోసం ప్రాణాలు ఇస్తానని చెప్పి సైన్యంలో చేరి ప్రాణాలు కోల్పోవాల్సి రావడం బాధాకరం. చిన్న వయసులోనే యుద్ధం లో మృతిచెందడం తీవ్రంగా కలచివేసిందన్నారు.
కుటుంబానికి రూ.25 లక్షల వ్యక్తిగత సాయం
ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు తరపున మురళీనాయక్ కుటుంబాన్ని పరామ ర్శించేందుకు వచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.50 లక్షలు ఆర్థికసాయం చేయాలని నిర్ణయించాం. ఆ కుటుంబానికి ఐదు ఎకరాల స్థలం, 300 గజాల ఇంటి స్థలంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తాం. మురళీనాయక్ స్మారక చిహ్నం ఏర్పాటు చేస్తాం. ఆ కుటుంబానికి ఇంకా ఎలాంటి సాయం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. నా వ్యక్తిగతంగా రూ.25 లక్షల సాయం ప్రకటిస్తున్నా. ఉగ్రవాదులు దేశం మీద దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కాల్పుల విరమణను ఉల్లంఘించారు. కాల్పుల విరమణ శాంతికి ఒప్పందం కాదు. ప్రత్యేక పరిస్థితుల్లో పాకిస్థాన్ కాళ్ల బేరానికి వచ్చింది. కాళ్ల బేరానికి వచ్చిన మూడు గంటల్లోనే ఉల్లంఘనకు పాల్పడిరదన్నారు. ఉగ్రదాడికి వారం రోజుల ముందు పాకిస్థాన్ ఆర్మీ జనరల్ ఉగ్రవాదులను ప్రేరేపించి దాడికి ఉసిగొల్పారు.
అనేక మంది అమాయకుల ప్రాణాలు అన్యాయంగా బలిగొన్నారు. కాల్పుల విరమణ అని ఒప్పుకొని దాన్ని ఉల్లంఘించారు. వీటన్నింటికీ ఎక్కడో ఒక చోట ముగింపు పలకా లి. మోదీ ప్రభుత్వం సరైన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్ర మంలో మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, శ్రీమతి సవిత, పార్లమెంటు సభ్యులు పార్థసారథి, ఎమ్మెల్యేలు అరవ శ్రీధర్, దగ్గుబాటి ప్రసా ద్, పల్లె సింధూరరెడ్డి, ఎం.ఎస్.రాజు, హౌడా చైర్మన్ టి.సి.వరుణ్, పార్టీ ప్రధాన కార్య దర్శి చిలకం మధుసూదన్‌రెడ్డి, పార్టీ నాయకులు తాతంశెట్టి నాగేంద్ర, భవానీ రవికు మార్, పత్తి చంద్రశేఖర్, ఈశ్వర్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.