- తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు
- పాల్గొన్న టీడీ జనార్దన్, సినీనటి ప్రభ, రామకృష్ణ
- ప్రపంచవ్యాప్తంగా నిర్వహణ అభినందనీయం
- మహనీయుడికి ఘనమైన నివాళిగా ఉద్ఘాటన
సౌదీ అరేబియా: ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో వైభవంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ వేడుకలు సౌదీ అరేబియాలో ‘‘సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య’’ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ తనయు లు నందమూరి రామకృష్ణ, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్, తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యులు టి.డి.జనార్దన్, ప్రముఖ సినీనటి ప్రభ, నందమూరి బెనర్జీ, నంద మూ రి బిజిలి తదితరులు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య అధ్యక్షులు కోనేరు ఉమామహేశ్వరరావు, ఈవెంట్ చైర్ కందిబేడల వరప్రసాద్, ‘‘సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య’’ కార్యవర్గ సభ్యులు, ఇతర తెలుగు సంస్థలు సహాయ, సహ కారాలతో ఈ వేడుకలు నిర్వహించారు.
తెలుగు ప్రజల గుండెల్లో చిరకాలం గుర్తుండేది ఎన్టీఆర్
ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్, తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యులు టి.డి.జనార్దన్ మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నాం. ఇప్పుడు ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు ప్రతి దేశంలో జరుపుకుంటున్నాం. ఎన్టీఆర్ రాజకీయ, సినీరంగాల్లో చెరగని ముద్ర వేశారు. మనకు రాముడు, కృష్ణుడు తెలుసు.. అలాగే శాలివాహన రాజులు తెలుసు.. ఆ తర్వాత తెలుగు ప్రజలు చిరకాలం గుండెల్లో పెట్టుకునేది ఎన్టీఆర్‌నే. ఆయన తన సినిమాల ద్వారా మంచి సందేశాన్ని సమాజానికి అందించారు. ఎన్టీఆర్ నటించారు అనేకన్నా జీవించారు అని చెప్పడం సబబు. రాజకీ యాల్లో ఆయన ఏం చెప్పారో అదే చేశారు. నాయకుడిగా ప్రజల మనసులు గెలుచుకు న్నారని అన్నారు. నందమూరి బెనర్జీ మాట్లాడుతూ ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఇంత ఘనంగా కార్యక్రమం నిర్వహించిన సౌదీ అరేబి యా తెలుగు సమాఖ్య వారికి కృతజ్ఞతలు. సినీరంగంలో ఎన్టీఆర్ ఖ్యాతిని మరో నటుడు అందుకోలేరు. ఆయన తను నటించే పాత్రల్లో జీవించేవారు. ఒక్కో సినిమాలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి కూడా ప్రేక్షకులను మెప్పించారు. మరో నటుడికి సాధ్యం కాని ఎన్నో ఘనతలు ఎన్టీఆర్ వెండితెరపై సుసాధ్యం చేశారని అన్నారు.
ఎన్టీఆర్ అభిమానులకు కృతజ్ఞతలు
ప్రముఖ నటి ప్రభ మాట్లాడుతూ ఎన్టీఆర్ హీరోయిన్‌ను అయినంత మాత్రాన నాపై ఇంత ప్రేమ, గౌరవం చూపిస్తున్న ఎన్టీఆర్ అభిమానులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. టి.డి.జనార్ధన్ నన్ను గుర్తుపెట్టుకుని ఈ కార్యక్రమానికి పిలిచారు. ఆయనకు నా కృత జ్ఞతలు. ఎన్టీఆర్ జీవితంలోని ఎన్నో విశేషాలతో తారకరామం అనే పుస్తకం రాయడం అభినందనీయం. ఎన్టీఆర్ నటుడిగా ఎన్నో పౌరాణిక, సామాజిక, జానపద పాత్రలతో ప్రేక్షకుల మనసుల్లో చిరస్మరణీయులు అయ్యారు. ఆయన రాముడిగా, కృష్ణుడిగా, రావ ణాసురుడిగా, దుర్యోధనుడిగా..ఇలా ఎన్నెన్నో పౌరాణిక పాత్రలతో గుర్తుండిపోయారు. ఎన్టీఆర్ పిల్లలు కూడా ఆయన వారసత్వాన్ని ఘనంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. పురందేశ్వరి ఢల్లీి రాజకీయాల్లో గొప్ప స్థాయిలో ఉండటం మనందరికీ గర్వకారణం. ఇంత ఘనంగా కార్యక్రమం నిర్వహించిన సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య వారికి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా వేడుకలు సంతోషంగా ఉంది
ఎన్టీఆర్ తనయులు నందమూరి రామకృష్ణ ప్రసంగిస్తూ నందమూరి కుటుంబంపై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు కడుపు నిండిపోతోంది. ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుక లు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం సంతోషంగా ఉందని, ఇంత ఘనంగా కార్యక్ర మం నిర్వహించిన సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య వారికి కృతజ్ఞతలు తెలిపారు. సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య కమిటీ సభ్యులు ఉమామహేశ్వరరావు, వేడుకలను దేశదేశా ల్లో ముందుండి నిర్వహిస్తున్న ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టి.డి.జనార్ధన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుజాతి మనది నిండుగ వెలుగు జాతి మనది అన్నట్లు మన తెలుగు వారు ఏ దేశంలో ఉన్నా మన తెలుగుతేజం, తెలుగు గౌరవం, ప్రత్యేకత చాటు కుంటాం..ఎన్టీఆర్ నటుడిగా ఎన్నో పౌరాణిక, సామాజిక, జానపద పాత్రల్లో అద్వితీయ నటన చూపించారు..ఆయన తను పోషించి ప్రతి పాత్రకు ఒక డిక్షనరీగా మారారని పేర్కొన్నారు. అలాంటి మహనీయుడి సినీ వజ్రోత్సవం ఖండ ఖండాంతరాలు దాటి సౌదీ అరేబియాలో నిర్వహించటం ఒక గొప్ప సంచలనమని అన్నారు. ఈ సందర్భంగా నిర్వ హించిన సాంస్కృతిక కార్యక్రమాలు వేలాదిగా హాజరైన వీక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమాన్ని కార్యవర్గసభ్యులు నాగశేఖర్ చందగాని, శర్మ చివుకుల, కె.వి.ఎన్. రాజు, దిలీప్ నాట్యం, రోహిత్ నంద, కిషోర్ అద్దంకి, సలీంషేఖ్, హరికిషన్, ఎన్.వి.బి. కె.కిషోర్, మాజీద్, పాపారావు జుజ్జవరపు, శివ సిరిగిన, శ్రీనివాస్ గుబ్బాల, మనోహర్ ప్రసాద్, విజయ్‌కుమార్ సుంకవల్లి, అనిత చెందగాని, రాజ్యలక్ష్మి, బ్రమర, శారద, కాశ్మీరా సహకారంతో విజయవంతంగా నిర్వహించారు. ఎన్‌ఆర్‌ఐ వింగ్ గ్లోబల్ నెట్‌వ ర్క్ వైస్ చైర్మన్ అశ్విన్ అట్లూరి పర్యవేక్షణలో ఏర్పాట్లు జరిగాయి.