- మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా శైలజ
- ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా ఆలపాటి సురేశ్
అమరావతి(చైతన్యరథం): ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రమే ఆంద్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (ఆప్కాబ్ చైర్మన్ సహా పలు డీసీసీబీ చైర్మన్లను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరి కొన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయ పాటి శైలజ (అమరావతి జేఏసీ)ని, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా ఆలపాటి సురేశ్ (అమరావతి జేఏసీ)ని నియమించింది. మొత్తం 22 పదవులను భర్తీ చేసింది.
నామినేటెడ్ పోస్టుల వివరాలు:
1. ఏపీ ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ బోర్డు జెడ్.శివప్రసాద్, నెల్లూరు సిటీ
2. విద్య, సంక్షేమ మౌలికవసతుల అభివృద్ధి కార్పొరేషన్, ఎస్.రాజశేఖర్, కుప్పం
3. ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ సుగుణమ్మ, తిరుపతి
4. ఏపీ కార్మిక సంక్షేమ బోర్డు, వెంకట శివుడు యాదవ్, గుంతకల్
5. ఏపీ భవన, ఇతర నిర్మాణ కార్మికుల బోర్డు వలవల బాబ్జీ, తాడేపల్లిగూడెం
6. ఏపీ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్, బురుగుపల్లి శేషారావు, నిడదవోలు
7. ఏపీ మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్, పితల సుజాత, భీమవరం
8. తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ, దివాకర్‌రెడ్డి, తిరుపతి
9. ఏలూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ
వాణి వెంకట శివప్రసాద్ పెన్నుబోయిన, ఏలూరు
10. ఏపీఎన్‌ఆర్‌టీ సొసైటీ రవి వేమూరు, తెనాలి
11. ఏపీ అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్,
మాలేపాటి సుబ్బానాయుడు, కావలి
12. ఏపీ ఎస్సీ కమిషన్, కె.ఎస్.జవహర్ కొవ్వూరు
13. ఏపీ మత్స్యకారుల సహకార సంఘాల సమాఖ్య, పెదిరాజు కొల్లు, నరసాపురం
14. ఏపీ కుమ్మరి శాలివాహన సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్,
పేరేపి ఈశ్వర్, విజయవాడ ఈస్ట్
15. ఏపీ వడ్డెర సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్, మల్లెల ఈశ్వరరావు, గుంటూరు వెస్ట్
16. ఏపీ టైలర్ అభివృద్ధి సహకార సమాఖ్య, ఆకాసపు స్వామి, తాడేపల్లిగూడెం
17. ఏపీ నీటిపారుదల అభివృద్ధి సహకార సంస్థ, లీలాకృష్ణ, మండపేట, జనసేన
18. ఏపీ లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ, రియాజ్, ఒంగోలు జనసేన 19. ఏపీ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్,
పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి, జనసేన
20. ఏపీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ సోల్ల బోజ్జిరెడ్డి, రంపచోడవరం, బీజేపీ
21. ఏపీ మహిళా కమిషన్, రాయపాటి శైలజ, అమరావతి జేఏసీ
22. ఏపీ ప్రెస్ అకాడమీ, ఆలపాటి సురేష్, అమరావతి జేఏసీ