- ఐదెకరాల భూమి, ఇంటి స్థలం, ఉద్యోగం
- స్మారక చిహ్నం, జిల్లా కేంద్రంలో కాంస్య విగ్రహం
- కళ్లి తండా మురళీనాయక్ తండాగా మార్పు
- మీడియాతో మంత్రి నారా లోకేష్
గోరంట్ల(చైతన్యరథం): దేశం కోసం ప్రాణాలర్పించిన వీరజవాన్ మురళీనాయక్ కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. మురళీనాయక్ చిన్నప్పటి నుంచి సైనికుడు కావాలని కలలు కన్నారు. తాను చనిపోతే జాతీయ జెండా కప్పుకునే చనిపోతానని చెప్పారు. కుటుంబానికి ఏకైక బిడ్డ..చిన్నప్పుడు వాళ్ల అవ్వా,తాతలతో కలిసి పెరిగిన వ్యక్తి..దేశం కోసం చిన్న వయసులోనే చనిపోవడం బాధాకరం. సరిహద్దుల్లో సైనికుల త్యాగాల వల్లే మనం సురక్షితంగా ఉండగలుగుతున్నామని అన్నారు.
కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థికసాయం
వీరజవాన్ మురళీనాయక్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.50 లక్షల పరిహారం, 5 ఎకరాల పొలంతో పాటు రూ.300 గజాల ఇంటి స్థలం ఇస్తామని సీఎం చంద్రబాబు చెప్పారని వివరించారు. వీరజవాన్ మురళీనాయక్ తండ్రికి ప్రభు త్వ ఉద్యోగం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వీరజవాన్ మురళీనాయక్ కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని తెలిపారు. ముఖ్య మంత్రి చంద్రబాబు తనతో మాట్లాడారు. ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌తోనూ మాట్లాడినట్లు వివరించారు. అంత్యక్రియలు సొంత భూమిలో నిర్వహిస్తున్నందున అక్కడే మెమోరియల్ కూడా నిర్మించాలని నిర్ణయిం చాం. జిల్లా కేంద్రంలో వీరజవాన్ మురళీనాయక్ కాంస్య విగ్రహం కూడా ఏర్పాటు చేసి భారతీయులు మురళీ నాయక్‌ను ఆదర్శంగా తీసుకునే విధంగా చర్యలు తీసు కుంటామని తెలిపారు.
కళ్లితండాకు మురళీనాయక్ తండాగా పేరుమార్పు
శత్రువులతో పోరాడుతూ వీరమరణం పొందిన అమరజవాన్ మురళీనాయక్ స్వగ్రా మం కళ్లితండాను మురళీనాయక్ తండాగా పేరు మార్చాలని సర్పంచ్, గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు. దీంతో కళ్లితండాను మురళీనాయక్ తండాగా పేరు మారుస్తామని, తామంతా సైనికులకు అండగా ఉంటామని మంత్రి చెప్పారు.