అమరావతి (చైతన్యరథం): జమ్ముకాశ్మీర్‌లో పాకిస్థాన్ మూకల కాల్పుల్లో వీర మరణం పొందిన జవాను మురళీ నాయక్ అంత్యక్రియల్లో విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొననున్నారు. ఇందుకోసం మంత్రి లోకేష్ ఆదివారం శ్రీసత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. యుద్ధభూమిలో వీరమరణం పొందిన మురళీనాయక్ స్వగ్రామం గోరంట్ల మండలంలోని కళ్లితాండ వెళ్లి అమర వీరుడి పార్థివ దేహానికి మంత్రి లోకేష్ నివాళులు అర్పిస్తారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, అంత్యక్రియల్లో పాల్గొంటారు.
ఇలాఉంటే వీర జవాన్ అంత్యక్రియలు అధికారిక, సైనిక లాంఛనాలతో జరుగుతాయి. ఈ ఆంత్యక్రియలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనిత కూడా హాజరవుతారు.