- సాగునీటి ప్రాజెక్టులపై వైసీపీ మొసలి కన్నీరు
- గత ఐదేళ్లలో కేటాయించింది రూ.2,011 కోట్లే
- సీమ వాసులను నిండా ముంచిన జగన్‌రెడ్డి
- చంద్రబాబు హయాంలో పరుగులు పెట్టిన ప్రాజెక్టులు
- ఒక్క టీడీపీ పాలనలోనే రూ.12,441 కోట్ల ఖర్చు
- హంద్రీనీవాకు అధిక నిధులు..జూలై 10 డెడ్‌లైన్
- గోదావరి-బనకచర్ల ద్వారా కోనసీమగా రాయలసీమ
రాయలసీమను రతనాల సీమగా మార్చాలనే సంకల్పంతో చంద్రన్న ఒకవైపు అహ ర్నిశలు శ్రమిస్తుంటే.. మరోవైపు ఆ ప్రాంత వైసీపీ నేతలు అది జీర్ణించుకోలేక జరుగు తున్న అభివృద్ధిపై బురద జల్లే పనిలో నిమగ్నమయ్యారు. సీమలో సాగు విస్తీర్ణం తక్కువ గా ఉన్న ప్రాంతాల్లో కాలువల ద్వారా నీటిని మళ్లించి తద్వారా సాగు, తాగు, పరిశ్రమల ప్రోత్సాహాకానికి ఒక విజన్‌తో సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారు. అందులో భాగంగానే హంద్రీనీవా సుజల స్రవంతి విస్తరణ పనులు చేపట్టి త్వరితగతిన పనులు పూర్తి చేసేం దుకు డెడ్ లైన్ విధించారు. సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తే సాగు విస్తీర్ణం పెరుగుతుంది. వలసలు తగ్గుముఖం పట్టి రైతాంగానికి మేలు చేకూరడమే కాకుండా స్థానికంగా వ్యవసా య కూలీలకు ఉపాధి లభిస్తుంది. పరిశ్రమలకు తోడ్పాటుగా ఉంటుంది. ఇవన్ని కనిపిం చని సైకో బ్యాక్ జగన్‌రెడ్డి మెప్పు కోసం మాట్లాడుతున్నారు తప్పితే… వారి మాటల్లో నిజం 1 పర్సెంట్ కూడా లేదని వాళ్ళకి తెలుసు. 2014-2019 మధ్య కాలంలో రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టింది ఎంత… జగన్ రెడ్డి ఐదేళ్ల పానలో చేసింది ఎంతా అని లెక్కలు వేసుకుంటే వాళ్లకే తెలుస్తుంది. మంచి చేసింది చంద్రన్న అయితే… సీమ ప్రజలను ముంచేసింది జగన్ అని. ఎక్కడ ఏ మంచి పని మొదలు పెట్టినా… దాన్ని దెబ్బతీసేందుకు రాబంధుల్లా వాలిపోయే వైసీపీ నేతలకు… ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో కూడా ఇంకా బుద్ధి రాలేదు. అధికారంలోకి వచ్చిన 11 నెలల్లోనే సీఎం చంద్రబాబు ఇంత అభివృద్ధి చేస్తుంటే చూడలేకపోతున్న వైసీపీ నేతలు కళ్లున్న కబోధుల్లా విమర్శలకు దిగుతున్నారు. ఇది వారి దిగజారుడు తనానికి నిదర్శనం.
రాష్ట్రమంతా సిరుల జరులు
కరవు నేలపై సాగును వృద్ధిలోకి తేవాలనే సంకల్పంతో నాడు అన్న ఎన్టీఆర్ తెలుగు గంగ, హంద్రీ నీవా సుజల స్రవంతి, గాలేరు నగరి వంటి ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుడి తే… నేడు చందన్న ఆ ప్రాజెక్టులకు అధిక నిధులు కేటాయించి పనులు పూర్తి చేశారు. సీమలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే సంకల్పంతో వలసలు నివారించాలనే ధ్యేయంగా పనిచేస్తున్నారు. అందుకు అనుగుణంగా ప్రస్తుతం రాయలసీమలోని అన్ని జిల్లాల్లో సాగునీటి ప్రాజెక్టుల పనులు కూటమి ప్రభుత్వం వచ్చాక ఊపందుకున్నాయి. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు గత 11 నెలలుగా పరుగులు పెడుతున్నాయి. తెలుగు వారి జీవనాడి అయిన పోలవరం పనులు ఐదేళ్ల తర్వాత సీఎం చంద్రబాబు ఇప్పటికే పనులు ప్రారంభించారు. 2027 నాటికి పూర్తి చేసేలా షెడ్యూల్ కూడా విడుదల చేశారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ ను పరుగులు పెట్టిస్తూనే వెనకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు ఊపిరిపోస్తున్నారు. 2025-2026 ఆర్థిక బడ్జెట్ లో జలవనరు శాఖకు రూ.18,019 కోట్లు అత్యధికంగా నిధులు కేటాయించారు. నీటి ప్రాజెక్టులు వేగంగా పూర్తిగా చేసేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారు. అలాగే వరదల సమయంలో సముద్రంలో ఏటా వృథాగా పోతున్న వేల టీఎంసీల నీటి నుంచి 200 టీఎంసీల నీటిని రాయలసీమ ప్రాంతానికి తరలించి కరువు రహిత సీమగా మార్చేం దుకు కృతనిశ్చయంతో సీఎం చంద్రబాబు వడివడిగా పరుగులు పెడుతున్నారు. ఇప్పటికే గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్‌కు సంబంధించి ప్రత్యేకమైన కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్ట్ పూర్తికి కేంద్రం నుంచి సహకారం కావాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. అటు తెలంగాణ ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నాల ను చాణిక్యంతో తిప్పికొడుతూ ప్రాజెక్ట్ అవశ్యకతను వివరిస్తూ… రాయలసీమను సస్య శ్యామలం చేసే దిశగా మన చంద్రన్న అడుగులు వేస్తున్నారు.
సీమ ప్రాజెక్టులకు అత్యధిక నిధులు కేటాయించిన ఘనత చంద్రన్నదే
విభజన అనంతరం సీఎం చంద్రబాబు ప్రభుత్వం 2014`19 ఐదేళ్ల కాలంలో రాయలసీమ ప్రాజెక్టులపై రూ.12,441 కోట్లు ఖర్చు చేసింది. చంద్రబాబు అధికారంలో ఉంటే రాయలసీమకు పండగే అన్న రీతిలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పైపుల ద్వారా కృష్ణా జలాలను మద్రాసుకు తరలించాలని ఆనాడు తమిళనాడు ప్రయత్నిస్తే దాన్ని ఎన్టీఆర్ వ్యతిరేకించారు. రాయలసీమ గడ్డపై తెలుగుగంగ ప్రాజెక్టు చేపట్టారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును నిర్మించారు. ఎన్టీఆర్ ప్రారంభించి.. చంద్రన్న అభివృద్ధి చేసిన తెలుగు గంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, సోమశిల, స్వర్ణముఖి ప్రాజెక్టులు ఈనాడు రాయలసీమకు వరప్రసాదాలయ్యాయి. గాలేరు-నగరికి చంద్రబాబు రూ.1,546.26 కోట్లు ఖర్చు చేశారు. హంద్రీ-నీవాకు రూ.4,182 కోట్లు ఖర్చు చేసింది.