విధ్వంసమే అజెండాగా ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసానికి తెరతీశాడు. రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తే… ఏడారి మార్చి రాయలసీమ వాసులకు తీరని నష్టం చేకూర్చాడు. ఎన్నికల ముందు జలయజ్ఞాన్ని పూర్తి చేస్తామని, పోలవరం, వెలిగొండ సహా అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తామ, రక్షిత మంచినీరు %-% సాగు నీరు కల నిజం చేస్తామని, చెరువులను పునరుద్దరిస్తాం, జలకళను తీసుకోస్తామని కల్లబొల్లి హామీలను 2019 ఎన్నికల ముందు జగన్ రెడ్డి గుప్పించారు. కాని అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ఐదేళ్ల కాలంలో ఏందయ్యా చేసింది అంటే గుండు సున్నా. నీటి ప్రాజెక్టులు కొట్టుకుపోయి ప్రజలు చనిపోయినా పట్టిన జగన్ రెడ్డి… తన ఐదేళ్ల పాలనలో జలవనరుల రంగాన్ని పూర్తిగా నాశనం చేశాడు. టీడీపీ ఐదేళ్లలో జలవనరుల రంగంలో రూ.68,293.94 కోట్ల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా 62 ప్రాజెక్టులను చేపట్టి, 23 ప్రాజెక్టులను పూర్తి చేసింది. 32.02 లక్షల ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణ, 7 లక్షల ఎకరాలకు నూతన ఆయకట్టు అందించింది.
కానీ జగన్ ప్రభుత్వం రూ.32,998.05 కోట్లు ఖర్చు చేసి ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదు. ఒక్క ఎకరాకు సాగునీరందించలేదు. పైగా రూ.10 వేల కోట్లు బకాయిలు పెట్టి వెళ్లాడు. రివర్స్ టెండరింగ్ పేరుతో కాలయాపన చేసి కాంట్రాక్టర్లను మార్చి కమీషన్లు దండుకుంటున్నారు. 5 ఏళ్లుగా రాయలసీమలో ప్రగతి, అభివృద్ధి లేదు, ప్రాజెక్టుల నిర్మాణం ఊసే లేదు, వలసలు పెరిగిపోయాయి. రాయలసీమ ప్రాజెక్టులకు జగన్ కేవలం రూ.2,011.13 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. విభజన చట్టం 11వ షెడ్యూల్డ్ లో హంద్రీ నీవా, గాలేరు నగరిని పొందుపరిచారు. అయినా కేంద్ర జలశక్తి కమిషన్ నాన్ అప్రూడ్ ప్రాజెక్టులుగా జాబితాలో పేర్కొన్నా జగన్ రెడ్డి నోరెత్తకపోవడం సిగ్గుచేటు. టీడీపీ ప్రభుత్వంలో ప్రారంభించిన ముచ్చుమర్రి ఆర్డీఎస్, గుండ్రేవుల, వేదవతి, గాలేరు-నగరి, హంద్రీ-నీవా కాలువల సామర్థ్యం పెంపునకు జగన్ హయాంలో తగు స్థాయిలో నిధులు విడుదల చేయలేదు. గాలేరు-నగరికి చంద్రబాబు రూ.1,546.26 కోట్లు ఖర్చు చేయగా… జగన్ ఖర్చు చేసింది రూ.443.43 కోట్లు మాత్రమే. హంద్రీ-నీవాకు చంద్రన్న రూ.4,182 కోట్లు ఖర్చు చేయగా… జగన్ రెడ్డి ఖర్చు చేసింది రూ.515.79 కోట్లు మాత్రమే. ఈ ద్రోహాన్ని కప్పి పెట్టుకోవడానికి రాయలసీమ లిఫ్టు పేరుతో జగన్నాటకం ఆడి కృష్ణ, గోదావరి జలాలను కేంద్రానికి ధారాదత్తం చేశారు. రూ.900 కోట్లు అవినీతికి పాల్పడ్డారు.
2025 -2026 ఆర్థిక బడ్జెట్‌లో సీమకే ప్రాధాన్యం
జగన్‌రెడ్డి వినాశన పాలన అనంతరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభు త్వం రాయలసీమ ప్రాజెక్టులకు అత్యధిక నిధులు కేటాయించారు. 2025-2026 ఆర్థిక బడ్జెట్‌లో సాగునీటి రంగానికి రూ.18,019 కోట్ల కేటాయించారు. ఇక్కడా రాయలసీమ ప్రాజెక్టులకే అత్యధికంగా కేటాయింపులు చేశారు. కర్నాటక, తెలంగాణ ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి గోదావరి`బనకచర్ల ప్రాజెక్ట్ ఆమోదానికి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. గోదావరి వరదల జలాలను రాయలసీమకు తరలించి రాయలసీమను కోనసీమగా మార్చేలా సీఎం చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్నారు.
వైసీపీ నేతలు కళ్లున్న కబోధులు
వెనకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పూర్తికి సీఎం చంద్రబాబు అను నిత్యం ఆరాటపడుతుంటే.. వైసీపీ నేతలు మాత్రం మీడియా ముందుకొచ్చి సిగ్గులేని విమర్శలు చేస్తున్నారు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల కోసం చంద్రబాబు ప్రభు త్వం రూ.వేల కోట్ల నిధులు కేటాయించి ఖర్చు చేస్తున్నా కళ్లున్న కబోధుల్లా రాయల సీమకు చెందిన వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. రాయలసీమ ప్రాజెక్ట్‌ల కోసం జగన్‌రెడ్డి ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఏం చేసిందో చెప్పే దమ్ములేదు కానీ.. కోట్లు ఖర్చు చేస్తున్న కూటమి ప్రభుత్వంపై చిందులు తొక్కడం వారి అజ్ఞానానికి నిదర్శనం. ఏ ప్రభుత్వం ఏమి చేసిందో తెలుసు కాబట్టే సీమ ప్రజలు జగన్‌రెడ్డికి గత ఎన్నికల్లో కర్ర కాల్చి వాతపెట్టారన్న సంగతి వైసీపీ నేతలు గుర్తుపెట్టుకుంటే మంచిది.
జూలై 10 డెడ్‌లైన్..
హంద్రీ-నీవా సుజల స్రవంతి ద్వారా ఈ ఏడాది జూలై 10న నీటిని విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ పథకం ఫేజ్-1, 2 కింద 554 కిలోమీటర్ల మేర కాలువ విస్తరణ, లైనింగ్ పనులకు రూ.3,873 కోట్లు ఖర్చు చేస్తున్నారు. త్వరితగతిన పూర్తిచేసేలా అధికారులు శ్రద్ధ పెట్టారు. జూలై 10 నాటికి నీటి విడుదలకు సమాయత్తం అయ్యేలా పనులు వేగంగా జరుగుతున్నాయి. హంద్రీ-నీవా, పోలవరం-బనకచర్ల పథకాలు పూర్తయితే రాయలసీమలో కరవు మాటే వినిపించదు. హంద్రీ-నీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ ప్రాజెక్టులకు రూపకల్పన చేసి రాయలసీమ దశ..దిశ మార్చిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది. నేడు గొల్లపల్లి ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లిచ్చింది.. కియా కంపెనీని జిల్లాకు తీసుకొచ్చిన ఘనత టీడీపీదే. ఇకనైనా వైసీపీ నేతలు రాజకీయ విమర్శలు మాని వాస్తవాలు తెలు సుకుని ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను స్వాగతిస్తే మంచిది.
– ప్రవీణ్ బోయ, అనలిస్ట్