అమరావతి (చైతన్యరథం): దేశ రక్షణలో భాగంగా ఆపరేషన్ సిందూర్‌లో రాష్ట్రానికి చెందిన జవాన్ మురళీనాయక్ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. దేశం కోసం తన ప్రాణాలను అర్పించి అమరవీరుడైన శ్రీసత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలానికి చెందిన మురళీ నాయక్‌కి అశ్రు నివాళులు అర్పిస్తున్నానన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.