న్యూఢిల్లీ: భారత్-పాక్ నడుమ ఉద్రిక్తతల నేపథ్యంలో ఉత్తర, పశ్చిమ భారత్‌లోని పలు విమానాశ్రయాలను ఈ నెల 15 వరకు మూసివేయనున్నారు. శ్రీనగర్, చండీగఢ్, సహా మొత్తం 24 ఎయిర్‌పోర్టుల్లో పౌర విమానాల రాకపోకలను నిలిపివేశారు. తొలుత ఈ నెల 10 వరకు రాకపోకలపై ఆంక్షలు ఉండగా.. తాజాగా మరో ఐదు రోజులు పొడిగించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ఆయా ఎయిర్‌పోర్టులకు రాకపోకలు రద్దు చేసినట్లు విమానయాన సంస్థలు ప్రకటించాయి. ఈ క్రమంలోనే జమ్మూ, చండీగఢ్‌లో చిక్కుకున్న విమాన ప్రయాణికుల కోసం రైల్వేశాఖ 4 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది.
చండీగడ్, శ్రీనగర్, అమృత్‌సర్, లూథియానా, భుంటార్, కిషన్‌గఢ్, పాటియాలా, సిమ్లా, ధర్మశాల, భటిండా, జైసల్మేర్, జోద్‌పూర్, లేప్‌ా, బికనీర్, పఠాన్‌కోట్, జమ్మూ, జామ్‌నగర్, రాజ్‌కోట్, భుజ్ తదితర విమానాశ్రయాలను మూసివేసినట్లు పౌరవిమానయాన శాఖ ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ వెలువడగానే ఎయిరిండియా ‘ఎక్స్’ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. ప్రయాణికులకు ఉచితంగా టిక్కెట్లు రీషెడ్యూల్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఒకవేళ రద్దు చేసుకుంటే.. పూర్తి రీఫండ్ చెల్లిస్తామని తెలిపింది. ఇండిగో సైతం ఇదే తరహా ప్రకటన వెలువరించింది. మరోవైపు భద్రతా ప్రోటోకాల్స్ వల్ల ఢల్లీి విమానాశ్రయంలో విమాన సేవలపై ప్రభావం పడిరదని ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య మొత్తం 60కు పైగా దేశీయ విమానాల రాకపోకలు, 4కు పైగా అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేసినట్లు పేర్కొన్నారు.