అమరావతి (చైతన్యరథం): విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ బుధ, గురువారాల్లో తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని, 5 గంటలకు సత్యవేడులోని వీఎంకే కళ్యాణ మండపానికి చేరుకుంటారు. 5.30కు సత్యవేడు నియోజకవర్గంలోని ఉత్తమ కార్యకర్తలతో మంత్రి లోకేష్ సమావేశం అవుతారు. 6.30 కు సత్యవేడు నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశం అవుతారు. గురువారం ఉదయం 11 గంటలకు శ్రీ సిటీ కి చేరుకుంటారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకూ శ్రీ సిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు.