- రైతులను అన్ని విధాలా ఆండగా ప్రభుత్వం
- బెంగళూరులో ఫుల్‌టైమ్, తాడేపల్లి ప్యాలెస్‌లో పార్ట్‌టైమ్ ఉండే జగన్‌కు రాష్ట్రం గురించి ఏమి తెలుసు?
- కళ్లున్న కబోధిలా జగన్ రెడ్డి తీరు
- మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టీకరణ
అమరావతి (చైతన్యరథం): ఐదేళ్ళ వైసీపీ పాలనలో పండిరచిన పంటలకు మద్దతు ధర కల్పించకుండా వారి కష్టం నుంచి కూడా కమీషన్లు తీసుకున్న నీచ చరిత్ర వైసీపీ నేతలదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. మట్టిని దైవంగా, పైరుని ప్రాణంగా భావించే రైతన్న ఐదేళ్ళ వైసీపీ పాలనలో నా పార్టీ నేతల వైఖరి కారణంగా ఒక్క రోజు కూడా సంతోషంగా ఉన్న దాఖలాలు లేవు. ఆరుగాలం శ్రమించి రైతు పండిరచిన ధాన్యాన్ని అమ్ముకోవాలన్నా వైసీపీ నేతలకు జే ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి నాడు ఉండేది. నేడు పంటలను నేరుగా అమ్ముకోవడంతో పాటు 24 గంటల్లోపు చెల్లింపులు చేస్తూ రైతు సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. మార్కెట్‌లో ధర తక్కువ ఉన్న పంటలను మార్క్‌ఫెడ్ ద్వారా, ఇతర శాఖల ద్వారా కొనుగోలు చేస్తూ రైతుల్ని ప్రభుత్వం ఆదుకుంటోంది. జగన్‌రెడ్డి ఒకసారి ప్యాలెస్ నుంచి బయటికి వచ్చి చూస్తే వాస్తవాలు తెలుస్తాయి. బెంగళూరులో ఫుల్‌టైమ్, తాడేపల్లి ప్యాలెస్‌లో పార్ట్‌టైమ్‌గా కాలం గడుపుతున్న జగన్‌కు రాష్ట్రంలో జరిగే వాటి గురించి ఏమి తెలుస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.
రైతులకు అన్యాయం చేయమంటారా?
మిర్చికి మద్దతు ధర రూ.11,781 ఉంటే ప్రస్తుత మార్కెట్‌లో ధర 13,300 పలుకుతోంది. అంటే అంతకన్నా తక్కువ ఇచ్చి రైతులను రోడ్డున పడవేయ్యాలన్నది వైసీపీ కుట్ర. ప్రత్తికి రూ. 7,121 ఎంఎస్‌పీ ఉంటే మార్కెట్‌లో రూ.8 వేల వరకు ఉంది, శెనగ రూ.5,650 ఎంఎస్పీ ధర ఉంటే మార్కెట్‌లో 5,661 నుంచి 6,249 పలుకుతోంది. అంటే వీటిని ఎంఎస్‌పీకి కొని రైతులకు అన్యాయం చేయమంటావా జగన్ అని మంత్రి అచ్చెన్నాయుడు సూటిగా ప్రశ్నించారు.
కబోధిలా జగన్
మార్కెట్‌లో ధరలు పడిపోతే గతంలో జగన్ ప్యాలెస్‌లో పబ్జీ ఆడుతూ కాలక్షేపం చేసేవాడు. రైతుల కష్టం తెలిసిన మేము కూటమి ప్రభుత్వంలో ఆ విధంగా చేయటం లేదు. అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని రైతులను ఆదుకుంటున్నాం. కందుల ధర రూ.6,500కు పడిపోతే రూ.7,550 చొప్పున 55 వేలకు పైగా మెట్రిక్ టన్నులు, మినుములు రూ. 6 వేల 300 మార్కెట్ ధర ఉండగా రూ.7,400 ధర చొప్పున 18.02 మెట్రిక్ టన్నులు, పెసలు 7,800 మార్కెట్‌లో ధర ఉంటే 8,682 చొప్పున 5,476 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం. ఇంకా కొనడానికి సిద్ధంగా ఉన్నాం. కళ్లున్న కబోధిలా మాట్లాడుతున్న జగన్‌కు ఇవేమీ కనిపించడంలేదా అని మంత్రి అచ్చెన్నాయుడు నిలదీశారు.
టమాటాకు కనీస మద్దతు ధర లేకపోయినప్పటికీ రైతులను ఆదుకోవడం కోసం ధర తగ్గినప్పుడల్లా రైతు బజార్ల ద్వారా విక్రయించి రైతులకు అండగా నిలబడుతున్నాం. పత్తికి సంబంధించి సీసీఐ ద్వారా 14 వందల కోట్ల రూపాయిల విలువైన పంటను కొనుగోలు చేశాం. పొగాకు బోర్డు ద్వారా పొగాకు ధరలను ఎప్పటికప్పుడు పరిశీలించి రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకుంటున్నాం. బోర్డు అధికారులతో సంప్రదింపులు జరిపి 20 కి.మీ మేర రవాణా ఖర్చులు కూడా భరించేలా చర్యలు తీసుకున్నాం. రైతులు సంతోషంగా ఉండడం ఇష్టం లేకే బెంగళూరు ప్యాలెస్‌లో కూర్చొని జగన్ అసత్య ప్రచారాలు సాగిస్తున్నాడు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని వైసీపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చి ఐదేళ్ల పాలనలో ఖర్చు చేసింది కేవలం రూ.1525 కోట్లు మాత్రమే. కూటమి ప్రభుత్వం ఈ పదినెలల కాలంలోనే రూ.6వేల కోట్ల రూపాయల మేర ధరల స్థిరీకరణ కింద ఖర్చు చేసింది. జగన్ చేసిన నిర్వాకాలకు ఇప్పటికీ, ఎప్పటికీ రైతు ద్రోహిగా నిలిచిపోతాడని మంత్రి అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు.