- అనంతరం భగీరథ మహర్షి జయంతి వేడుకలకు హాజరు
అమరావతి (చైతన్యరథం): విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదివారం మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు దుగ్గిరాల మండలం కేఆర్ కొండూరులోని శ్రీమహంకాళీ అమ్మవారి దేవస్థానం పున:ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 4.00 గంటలకు మంగళగిరి పట్టణంలోని భగీరథ దేవాలయం వద్ద నిర్వహించనున్న భగీరథ మహర్షి జయంతి వేడుకల్లో పాల్గొంటారు.