అమరావతి (చైతన్యరథం): అంతర్జాతీయ కార్మిక దినోత్సవవ మే డే సందర్భంగా కార్మిక లోకానికి విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కార్మికులు తమ హక్కుల కోసం రక్తం చిందించి పోరాడి సాధించిన రోజే మే డే. శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములు. కూటమి ప్రభుత్వ పాలనలో కార్మికులు, కర్షకుల అభ్యున్నతికి కృషిచేస్తున్నాం. వారికి అన్ని విధాల అండగా నిలుస్తున్నాం. కార్మిక సోదర, సోదరీమణులకు అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు.