సింహాచలం లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద జరిగిన దుర్ఘటన తీవ్ర ఆవేదన కు గురిచేసింది. ఈ ఘటనలో గాయపడిన వారికి విశాఖ కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. బాధితులకు మెరుగైన చికిత్స కోసం అవసరమైతే ప్రైవేటు ఆసుపత్రులకు తరలించాల్సిందిగా యంత్రాంగాన్ని ఆదేశించాం. పోలీసులు, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది.
సింహాచలం దుర్ఘటన దురదృష్టకరం: ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్
సింహాచలంలో గోడ కూలడం మూలంగా క్యూలైన్‌లో ఉన్న ఎనిమిది మంది భక్తు లు మృతిచెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. చందనోత్సవ సమయాన ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సాను భూతి తెలియజేస్తున్నా. వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. విశాఖపట్నం జిల్లా అధికారుల నుంచి ఈ ఘటన వివరాలు తెలుసుకున్నాను. భారీవర్షాల మూలంగా గోడ కూలిందని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించాను.
విచారణకు ఆదేశించాం: దేవాదాయ మంత్రి ఆనం
సింహాచలం ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశా లు జారీ చేశాం. జరిగిన దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాను. మృతులకు టుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ ఘటనపై విచారణకు ఆదేశిం చాం. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆలయ ప్రాంతంలో రక్షణ చర్యలు తీసుకుంటాం.
ఘటన దురదృష్టకరం: మంత్రి పొంగూరు నారాయణ
సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో గోడ కూలి భక్తులు మృతిచెందిన ఘటనపై మంత్రి నారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దైవ దర్శనం కోసం క్యూ లైన్‌లో వేచి ఉన్న భక్తులు మృతిచెంద డం దురదృష్టకరం. మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది.
బాధితులకు ప్రభుత్వం అండ: మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
సింహాచలంలో గోడ కూలి మృతిచెందిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సాను భూతి తెలియజేస్తున్నా. భారీవర్షాలు, ఈదురుగాలులతో గోడ కూలి భక్తులు చనిపోవ డం దురదృష్టకరం. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యసహాయం అందిస్తున్నాం.
మనోవేదనకు గురిచేసింది: మంత్రి అచ్చెన్నాయుడు
స్వామి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడం తీవ్ర మనోవేదనకు గురిచేసింది. ప్రమాద ఘటనపై జిల్లా అధికారులతో మాట్లాడాను. మృతు ల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అదేశించాం.
అకాల వర్షంతో ఘటన: మంత్రి డోలా
సింహాచలం ఘటన కలచివేసింది. గోడ కూలి 7 మంది భక్తులు మృతిచెందడం బాధాకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం. అధికారులు నెలరోజులు శ్రమించి భక్తులకు ఎలాంటి ఇబ్బం దులు లేకుండా సౌకర్యాలు కల్పించినా అకాల వర్షానికి ఈ ఘటన జరగడం దుర దృష్టకరం. ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుం టుంది.
క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి: మంత్రి కందుల దుర్గేష్
సింహాచలం లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవంలో అపశ్రుతి జరగడం కలచి వేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. బాధిత కుటుంబాలను ప్రభు త్వం ఆదుకుంటుంది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం.. త్వరగా కోలు కుంటారని ఆశిస్తున్నాం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.