అమరావతి (చైతన్య రథం): ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయకృష్ణారెడ్డి కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ వరకు చేసిన ప్రయాణం అభినందనీయమని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. ఈమేరకు ఎక్స్ వేదికపై పోస్టు పెడుతూ.. ధైర్యం, అవిశ్రాంత కృషి ఉంటే ఏ కల కూడా పెద్దది కాదని ఉదయ్ రుజువు చేశారని సీఎం పేర్కొన్నారు. కష్టపడేవారికి మంచి భవిష్యత్తు ఉంటుందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తన పోస్టులో పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఉల్లపాలేనికి చెందిన ఉదయ కృష్ణారెడ్డి.. ఇటీవల వెల్లడైన సివిల్స్ ఫలితాల్లో 350వ ర్యాంక్ సాధించారు.