చంద్రబాబు నాయుడు తలంపుల నుంచి వికసించిన అందమైన అద్భుతమైన నిర్మాణ నగరి అమరావతి. మన పురాణేతిహాసాలతో దేవేంద్రుడి రాజధానిగా అభివర్ణింపబడ్డ నగరం అమరావతి. అమరలింగేశ్వరుడు కొలువైవున్న నగరం అమరావతి. క్రీస్తు పూర్వమే భరత ఖండంలో సువిశాల సామ్రాజ్యానికి రాజధానిగా వెలుగొందిన నగరం, గౌతమ బుద్ధుని పాద స్పర్శతో పునీతమైన నగరం అమరావతి. అమరావతి నగర నిర్మాణమైతే తెలుగుజాతి ఖ్యాతి అఖండ దేశాలలో చెరగని ముద్ర, చరితార్దుడై చిరస్మరనీయుడై చంద్రబాబు కీర్తి ఆచంద్రతారార్కమై వెలుగొందున్. కృష్ణవేణి చెంత, దుర్గాదేవి ఆశీస్సులతో, పానకాల నరసింహుని శక్తి, భూదేవి దీవెనలతో ఐదు కోట్ల తెలుగునాడు కలల ప్రజారాజధాని నిర్మాణం అమరావతి. నాడు సనాతనపు ధర్మ సంస్కృతికి, కూచిపూడి నాట్యంతో విరాజిల్లిన నగరం అమరావతి. నేడు ఐదు కోట్ల తెలుగునాడు ప్రజల కలలను సాకారం చేస్తూ పురుడు పోసుకుంటున్న మహానగర నిర్మాణమే అమరావతి. పర్యావరణాన్ని, పచ్చదనాన్ని పెంపుదించుకొంటూ పరిపాలన కేంద్రాలను, మానవ వనరులను సముపార్జించుకున్న సమాచార సాంకేతిక స్వర్ణమందిరం అమరావతి. ఉన్నత జీవన ప్రమాణ ఉపాదులకు ఉషోదయం, నింగిని తాకే మేడలు, నిముషాల్లో ప్రయాణాలు అన్ని వసతులు అమర్చే నందనం అమరావతి. కాలం గీసిన చిత్రం, చరిత్ర చెక్కిన శిల్పం `అమరావతి. తెలుగువారి మనోబలం, తెలుగు జాతి భవితవ్యం `అమరావతి. చంద్రకాంతి చల్లదనం, ఆచంద్రార్కం నిలిచే అసమాన సౌంధర్య నగరి అమరావతి. చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిన నాటి అమరావతే నేటి ఆంధ్రుల అపురూప రాజధాని అమరావతి. సంస్కృతికి కేంద్రమై, ధాన్యకటకమై దక్షిణ దేశానికంతటికీ నాగరికత పంచిన అమరావతి. ఆంధ్రుల వైభవం, ఐదు కోట్ల ఆంధ్రుల సుందర సుదూర స్వప్న మహానగరం అమరావతి. తెలుగుజాతి కీర్తికోసం తపించే ఆశల సౌధాల నిర్మాణమే అమరావతి. పునాదిరాయితో పురుడు పోసుకున్న నవ్య ప్రగతి నగర నిర్మాణం అమరావతి. ప్రపంచ విశ్వ నగరాలను తలదన్నేరీతిలో సకల సౌకర్యాల సాంకేతికతో నిర్మాణమవుతున్న ప్రగతి రథం అమరావతి. తెలుగు ప్రజల ఆశల, ఆకాంక్షల కొలువుల నెలవు `అమరావతి నగర నిర్మాణం.
తెలుగుతల్లి ముద్దుబిడ్డల ఉజ్వల భవిష్యత్ జాడ `అమరావతి. ఐదు కోట్ల ప్రజల హృదయవాణి అమరావతి. నవ్యాంధ్ర నడిబొడ్డున మహానగర నిర్మాణం అమరావతి. ఉదయించే సూర్య ప్రభాతాలతో, అస్తమించే అరుణ కిరణాలతో నవ్యాంధ్రుల ఘన చరిత `అమరావతి. గౌతమ బుద్దుడు సందర్శించిన అమరేంద్రపురి అమరావతి. మొన్నటి కలలు, చెలరేగిన నిన్నటి ఊహలు సాకార ప్రణాళికలై ఐదుకోట్ల హృదయాలను తబ్బిబ్బుచేయనున్న అమరావతి. చరిత మరువదు నిజము, మన అమరావతి చరిత్ర ఘనము. అమరేశ్వరుడు వెలసిన అమరావతి. బౌద్ధ భిక్షవులు నడయాడిన నేల అమరావతి. గౌతముని ప్రవచనాలు ప్రతిధ్వనించిన పుణ్యభూమి అమరావతి. ఎన్నో కళలకు కాణాచి అమరావతి. చరిత్రలో వెయ్యేళ్లు నిలిచి భరతావనిలో భవిష్యత్తులో ఆశయ సాధనకి అలవాలం అమరావతి. ముక్కారు పంటలు పండే పంట భూములను ప్రజారాజధాని కొరకు దానమిచ్చినట్టి ధన్య జీవులు, మట్టి మనుషుల, అన్నదాతల, ధన్యచరిత అమరావతి. తెలుగు ప్రజల ప్రాణం, తెలుగు ప్రజల స్వరం అమరావతి. తెలుగుజాతి ఖ్యాతి అఖండ జ్యోతి అమరావతి నిరంతరం వెలుగులు విరజిమ్మాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ…
నీరుకొండ ప్రసాద్