అమరావతి (చైతన్యరథం): నాకెంతో ఆప్తులు, సోదర సమానులు, కళామతల్లి ముద్దు బిడ్డ, హిందూపూర్ శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డును అందుకోవడం తనకెంతో సంతోషాన్నిచ్చిందని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. దివంగత నందమూరి తారక రామారావు వారసుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన బాలకృష్ణ 100 కి పైగా సినిమాలలో నటించి తెలుగు సినిమా రంగంలో తనదైన ముద్ర వేశారన్నారు. తల్లి బసవతారకం స్మారకంగా స్థాపించిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. బాలకృష్ణ మరెన్నో విజయాలు చవిచూడాలని, మరెంతో ఎత్తుకు ఎదగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నానన్నారు.