అమరావతి (చైతన్యరథం): బాల మావయ్య పద్మభూషణ్ పురస్కారం అందుకోవటం ఎంతో గర్వంగా ఉందని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుండి నా బాల మావయ్య పద్మభూషణ్ అవార్డు స్వీకరించటాన్ని స్వయంగా వీక్షించడం మరింత గర్వకారణం అన్నారు. నటుడిగా, నాయకుడిగా ఆయన అసాధారణ ప్రయాణం మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుందని మంత్రి లోకేష్ కొనియాడారు.