అమరావతి (చైతన్యరథం): గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్, గుంటూరు నగర పాలక సంస్థ, కుప్పం మునిసిపాలిటీల్లో టీడీపీ జెండా రెపరెపలాడిరది. విశాఖ మహానగర పాలక సంస్థ (జీవీఎంసీ) మేయర్‌గా టీడీపీ అభ్యర్థి పీలా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. జీవీఎంసీ పాలకవర్గ సమావేశం సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. జిల్లా సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి.. కార్పొరేటర్లు, ఎక్స్‌అఫిషియో సభ్యులు హాజరయ్యారు. జీవీఎంసీ మేయర్‌గా కూటమి అభ్యర్ధి, టీడీపీ కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు ఎన్నికైనట్లు జాయింట్ కలెక్టర్ ప్రకటించి.. ఆయనకు ధ్రువపత్రం అందజేశారు. మహా విశాఖ నగర పాలక సంస్థకు 2021లో ఎన్నికలు జరిగినప్పుడు మెయర్ పదవికి టీడీపీ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావు పేరును అధిష్టానం ప్రకటించింది. అప్పట్లో మెజార్టీ రాకపోవడంతో పేలాకు పదవి దక్కలేదు. నాలుగేళ్ల పాటు పార్టీ బలోపేతానికి చేసిన కృషితో పాటు, వైసీపీ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడిన పీలా శ్రీనివాసరావుకు పార్టీ అధిష్టానం మరోసారి అవకాశం కల్పించింది.
గుంటూరు మేయర్‌గా కోవెలమూడి
గుంటూరు నగరపాలక సంస్థ మేయర్గా కోవెలమూడి రవీంద్ర ఎన్నికయ్యారు. కూటమి బలపరిచిన రవీంద్రకు 34, వైసీపీ మద్దతిచ్చిన వెంకటరెడ్డికి 27 ఓట్లు వచ్చాయి. దీంతో మేయర్‌గా కూటమి అభ్యర్థి గెలిచినట్లు ప్రిసైడిరగ్ అధికారి భార్గవ్ తేజ ప్రకటించారు.
కుప్పం పురపాలిక చైర్మన్ పదవి టీడీపీ కైవసం..
చిత్తూరు జిల్లా కుప్పం పురపాలిక చైర్మన్ ఎన్నికను సోమవారం నిర్వహించారు. ఐదో వార్డు కౌన్సిలర్ సెల్వరాజ్‌ను టీడీపీ అభ్యర్థిగా, 9వ వార్డు సభ్యుడు ఎస్ డీ హఫీజ్‌ను వైసీపీ ప్రతిపాదించింది. టీడీపీ అభ్యర్థి సెల్వరాజ్‌కు 15 ఓట్లు, వైసీపీ అభ్యర్థి హఫీజ్‌కు 9 ఓట్లు వచ్చాయి. దీంతో సెల్వరాజ్ గెలుపును ఎన్నికల ప్రిసైడిరగ్ అధికారి శ్రీనివాసరాజు ధ్రువీకరించారు. దీంతో కుప్పంలో టీడీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు..
కాకినాడ జిల్లా తుని పురపాలక చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ పదవులను టీడీపీ దక్కించుకుంది. చైర్‌పర్సన్ నార్ల భువన సుందరి.. వైస్ చైర్మన్ ఆచంట సురేష్‌ను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికకు వైసీపీ కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్ వైస్‌ఛైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది.