- చేపల చెరువు సాగు అడ్డుకుంటున్నారు
- బినామీని పెట్టుకుని దౌర్జన్యం చేయిస్తున్నారు
- 30 మంది రైతులను ఇబ్బంది పెడుతున్నారు
- ప్రజావినతుల కార్యక్రమంలో రైతుల గోడు
- అర్జీలు స్వీకరించిన మంత్రి వాసంశెట్టి సుభాష్
మంగళగిరి(చైతన్యరథం): టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి సుభాష్, ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మెన్ గండి బాబ్జీ అర్జీలు స్వీకరించారు. మాజీ సీఐడీ అధికారి సునీల్‌కుమార్ వల్ల దాదాపు 30 మంది రైతులు ఇబ్బంది పడుతున్నారని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం విన్నకోట గ్రామానికి చెందిన ఉప్పలపాటి వెంకట కృష్ణారావు, పలువురు రైతులు ఫిర్యాదు చేశారు. నాగేంద్ర అనే బినామీని పెట్టుకుని రైతులు చేపల చెరువు సాగు చేసుకోనివ్వకుండా అడ్డుకుంటు న్నారని..అధికారులు వారికి తొత్తులుగా పనిచేస్తూ తమను పట్టించుకోవడం లేదని తెలి పారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
` నాటి ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అండతో తీగల చెరువు డొంకను వైసీపీ నాయకుడు నాసిన మల్లికార్జున దౌర్జన్యంగా ఆక్రమించుకున్నా అధికారులు పట్టిం చుకోలేదని నెల్లూరు జిల్లా విడవలూరుకు చెందిన దాసరి విజయ్‌కుమార్ ఫిర్యాదు చేశా రు. ఈ ఆక్రమణపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
` గతంలో తమకు ప్రభుత్వం బీ ఫారం ఇచ్చిన భూమిని కబ్జాదారులు దౌర్జన్యంగా ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నారని పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం ముసా పురం గ్రామానికి చెందిన కోటేశ్వరరావు ఫిర్యాదు చేశాడు.
` దివ్యాంగుడినైన తాను టీడీపీకి అనుకూలంగా మాట్లాడటంతో గత ప్రభుత్వంలో జగన్‌రెడ్డి మేనమామ రవీంధ్రనాథ్‌రెడ్డి తన పింఛన్ ఆపివేయించారని కడప జిల్లా వీరపునాయునిపల్లె ఉరుటూరు గ్రామానికి చెందిన కొత్తపు పెద్దగంగిరెడ్డి తెలిపారు. పింఛన్ ఇప్పించాలని వేడుకున్నారు.
` తమ భూమిని సర్వే చేసి తమకు అప్పగించాలని అధికారులకు చలానా కట్టి అర్జీ పెట్టుకోగా అధికారులు వచ్చి సర్వే చేయకుండా ఫొటోలు తీసుకెళ్లి సమస్యను పరిష్కరిం చకుండానే క్లోజ్ చేశారని అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులకు చెందిన మత్స్య రాస సన్యాసిరాజు ఫిర్యాదు చేశాడు.
` కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్మకూరు గ్రామానికి చెందిన సుంకర వీరభద్రప్రసాద్ సమస్యను వివరిస్తూ అక్టోబర్ నెలలో కురిసిన భారీ వర్షానికి చెరువుకు గండ్లు పడ్డాయని..గండ్లను పూడ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విన్నవించారు.
` తనకు పిత్రార్జితంగా వచ్చిన భూమిని వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాజీ ఏఎంసీ చైర్మన్ రాధాకృష్ణారెడ్డి ఆక్రమించుకున్నాడని నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన జక్కంరెడ్డి భాస్కర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ అక్రమణకు అధికారులు కూడా సహక రించారని.. వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు.