- ప్రపంచ పశువైద్య దినోత్సవ శుభాకాంక్షలు
అమరావతి(చైతన్యరథం): పశువైద్య రంగం అభివృద్ధికి అందిస్తున్న అవిరాళ కృషిని గుర్తు చేసేందుకు ప్రతీ ఏటా ఏప్రిల్ చివరి శనివారం ప్రపంచ పశువైద్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. పశుసంపద ను కాపాడటంలో పశువైద్యులు కీలక భూమిక పోషిస్తున్నారన్నారు. పశుసంవర్థక రంగం విప్లవాత్మకంగా అభివృద్ధి చెందాలని, తద్వారా వచ్చే ఫలాలు మొదటిగా పేదలకే అం దాలని ఆకాంక్షించారు. ప్రపంచ పశువైద్య దినోత్సవం సందర్భంగా పశువైద్యులు, శాస్త్రవేత్తలు, పశుసంవర్థక శాఖ సిబ్బందికి, పశుగణ రంగ శ్రేయోభిలాషులకు శుభా కాంక్షలు, అభినందనలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశ యాలు, ఆకాంక్షలకు అనుగుణంగా స్వర్ణాంధ్ర 2047ని సాకారం చేసుకునే విధంగా పశుసంవర్థక రంగ అభివృద్ధికి అందరం పునరంకితమవుదామని పిలుపునిచ్చారు.