అమరావతి (చైతన్యరథం): పవిత్ర పోప్ ఫ్రాన్సిస్ మరణం తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. కరుణ, వినయం, శాంతికి ప్రతీకగా నిలిచిన పోప్… మానవత్వం, ఆధ్యాత్మిక నాయకత్వం, నిబద్ధతతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జీవితాలను స్పృశించారని కొనియాడారు. ఆయన వారసత్వం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సమాజానికి సంతాపం తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాశ్వత శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానన్నారు.