- వారికి గ్రాట్యుటీ పెంపు హర్షణీయం
- ఇచ్చిన హామీలు ప్రభుత్వం నెరవేరుస్తుంది
- జగన్ పాలనలో వారిని మోసగించారు
- జీతం కోసం నాడు రోడ్డెక్కే పరిస్థితులు
- కేంద్రాలకు నాసిరకం ఆహారం, కోడిగుడ్లు
- అంగన్వాడీ, డ్వాక్రా కమిటీ అధ్యక్షురాలు సునీత
మంగళగిరి(చైతన్యరథం): అంగన్‌వాడీలకు గ్రాట్యుటీ పెంపుపై టీడీపీ అంగన్‌వాడీ, డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత హర్షం వ్యక్తం చేశారు. అంగన్వాడీలు చంద్రన్న మానస పుత్రికలని.. వారి సంక్షేమం, అంగన్‌వాడీ కేంద్రాల అభి వృద్ధికి చంద్రబాబు, కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గత దుర్మార్గ ప్రభుత్వంలో నేడు అంగన్‌వాడీలు రొడ్డెక్కాల్సిన పరిస్థితి లేదని..అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే మూడు హామీలు అమలు చేశామని తెలిపారు. గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద తోసి గ్రాట్యుటీ అమలు చేయకుండా అంగన్‌వాడీలను మోసగించిం దన్నారు. జగన్ పాదయాత్రలో తెలంగాణ కన్నా ఏపీలో జీతాలు ఎక్కువ పెంచుతామని చెప్పి పెంచకుండా మోసం చేశారు.
వైసీపీ నేతలు మాటలకే పరిమితం అయితే.. కర్నా టక, గుజరాత్ తరువాత అంగన్వాడీలకు గ్రాట్యుటీని అమలు చేసిన 3వ రాష్ట్రంగా ఏపీ ఉందని గుర్తుచేశారు. నేడు ప్రభుత్వానికి భారమైనా అంగన్‌వాడీలకు ఇచ్చి మాట మేరకు గ్రాట్యుటీని పెంచిందని తెలిపారు. అలాగే అంగన్వాడీలకు అదనపు యాప్‌ల భారాన్ని తగ్గించిందని చెప్పారు. రూ.4,200 ఉన్న జీతాన్ని రూ.10,500లకు పెంచిన ఘనత చంద్రబాబుదేనని, రాష్ట్రం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా వారికి ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. జగన్ తన పాదయాత్రలో 17 వేల అంగన్‌వాడీ కేంద్రాలు నిర్మిస్తామని దొంగ హామీలు ఇచ్చి ప్రభుత్వం వచ్చాక ఒక్క సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయలేదు. 2014 -2019లో దాదాపు 18,500 సెంటర్లను ఏర్పాటు చేసి 40 లక్షల మందికి లబ్ధి చేకూర్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదని గుర్తుచేశారు.
అంగన్‌వాడీలపై జగన్‌రెడ్డి ఉక్కుపాదం
అంగన్వాడీలు తమ సమస్యలపై 45 రోజులుగా రోడ్డెక్కి ధర్నాలు చేస్తుంటే.. నాడు జగన్‌రెడ్డి, ఆ శాఖ మంత్రి కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. అంతేకాకుండా గత పాలనలో అంగన్‌వాడీల్లో నాణ్యతలేని ఆహారం, మురిపోయిన గుడ్లను పంపిణీ చేశారు. నేడు కూటమి ప్రభుత్వంలో నాణ్యమైన ఆహారాన్ని గర్భిణులు, పిల్లలకు అందిస్తోంది. జగన్‌రెడ సాధికార సర్వే పేరుతో వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణలోకి తీసుకుని ప్రభుత్వ సంక్షేమ పథకాలను కట్ చేశారు. నేడు గత ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాన్ని రద్దు చేసి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకానికి అంగన్‌వాడీలను అర్హులుగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. జగన్‌రెడ్డి పాలనలో ఇచ్చిన ఫోన్లు సరిగ్గా లేక అంగన్‌వాడీలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంటే..నేడు వారికి మంచి ఫోన్లు ఇచ్చి ఒకే ఒక్క యాప్‌లోనే అన్ని పనులు చేసుకునేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకో వడం సంతోషకరమని ప్రశంసించారు. గత ప్రభుత్వంలో జీతాల కోసం అంగన్‌వాడీలు ఇబ్బంది పడ్డారు.. నేడు చంద్రబాబు పాలనలో ఒకటో తేదీనే వారు జీతాలు తీసుకుం టున్నారు. అంగన్‌వాడీల అభివృద్ధి, సంక్షేమం కోసం చంద్రబాబు ముందుంటారు. అంగన్‌వాడీలు చంద్రన్నకు అండగా ఉండాలని కోరారు.