అమరావతి (చైతన్య రథం): సివిల్ సర్వీసెస్ దినోత్సవం సందర్భంగా అందరు సివిల్ సర్వెంట్లకు సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు ప్రకటించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెడుతూ.. పాలన, సంక్షేమంలో మీరు కీలక పాత్ర పోషిస్తున్నారు. పరివర్తనాత్మక మార్పును తీసుకువస్తున్నారు. సవాళ్లను అధిగమించారు. మన దేశానికి సేవ చేయడంలో మీ కృషి, అవిశ్రాంత అంకితభావం ప్రశంసనీయం’ అని చంద్రబాబు పేర్కొన్నారు.