- చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం
- గోతాల సరఫరాకు చర్యలు తీసుకుంటాం
- పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్
కంకిపాడు(చైతన్యరథం): రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత దాల్వా కాలంలో 2 లక్షల 40 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.590 కోట్లు 24 గంటల్లోనే రైతులకు చెల్లించిందని, ఈ కాలంలో చిట్టచివరి గింజ వరకు కొనుగోలు చేసి రైతులకు అండగా నిలుస్తుందని పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గురువారం సాయం త్రం పౌరసరఫరాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మంజీర్ జిలాని సమూన్, కృష్ణా జిల్లా సం యుక్త కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి కంకిపాడు మండలంలోని పునాదిపాడు గ్రామం లో ధాన్యం కొనుగోలు కేంద్రం, ధాన్యం ఆరబెట్టు కేంద్రం, బాలాజీ మిల్లు, పెనమలూరు మండలం వణుకూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. తొలుత పునాది పాడు గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. అక్కడి రైతులతో ముఖాముఖి మాట్లాడారు. మిల్లుల దగ్గర, తేమ విష యంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ధాన్యం ఉత్పత్తి పెరి గినందున గోతం సంచుల కొరత ఉందని, వర్షం వచ్చినప్పుడు ధాన్యం కప్పుకోవడానికి టార్ఫాలిన్ పట్టలు సరఫరా చేయాలని, రవాణా కిరాయి డబ్బులు రావాలని రైతులు మంత్రికి విన్నవించారు.
దీంతో మంత్రి వెంటనే స్పందిస్తూ అవసరమైనన్ని గోతం సంచు లు రైతులకు సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల సంస్థ అధికారులు, సంయుక్త కలెక్టర్‌కు సూచించారు. తమకు ఇచ్చిన 600 గోతం సంచుల లో 100 సంచులు దెబ్బతిని ఉపయోగపడటం లేదని..సరైన గోతాలు ఇవ్వాలని, ధాన్యం ఆరబెట్టుటకు ప్లాట్‌ఫారాలు ఏర్పాటు చేయాలని మరికొందరు రైతులు విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి స్పందిస్తూ ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌తో సంప్రదించి ప్రతి పంచాయ తీలోనూ ధాన్యం ఆరబెట్టుటకు ప్లాట్‌ఫారాలు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తామన్నారు. మంచి గోతం సంచులు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కంకిపాడు మండలంలో జాతీయ రహదారి పక్కన గల బాలాజీ మిల్లును పరిశీలించి యజమాని వెంకటరావుతో మాట్లాడుతూ రైతుల నుంచి పలు ఫిర్యాదులు వస్తున్నాయని, మూడురోజుల్లో సావధా నంగా రైతులతో మాట్లాడి సరిచేసుకోవాలని, లేనిపక్షంలో 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇతర జిల్లాలకు పంపిస్తామని హెచ్చరించారు. అనంత రం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఖరీఫ్ సీజన్లో సుమారు 38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, రూ. 8600 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేసినట్లు తెలిపారు. రబీ సీజన్లో ధాన్యం కొనుగోలు ఎలా జరుగుతుందో పరిశీలించేందుకు వచ్చినట్లు చెప్పారు.
దాల్వా రెండో పంట చాలా అద్భుతంగా కొనుగోలు జరుగుతుందన్నారు. ఈసారి ధాన్యం ఉత్పత్తి బాగా పెరిగిందని.. దీంతో కొంత గోతం సంచుల కొరత ఏర్పడిరదన్నారు. గతంలో వ్యవసా య శాఖ అంచనాల ప్రకారం 35 గోతం సంచులు ఇవ్వడం జరుగుతోందని..అయితే ఈసారి దిగుబడి పెరగడంతో 60 నుంచి 65 బస్తాల ధాన్యం వచ్చిందన్నారు. దీంతో రైతుల అవసరాలను బట్టి 70 గోతం సంచుల సరఫరాకు చర్యలు తీసుకుంటామన్నారు. మిల్లుల దగ్గర 4 గంటల కంటే ఎక్కువ సమయం వాహనం ఉంటే జీపీఎస్ ద్వారా సమా చారం తమకు వచ్చి చేరుతుందని చెప్పారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒక భరోసా కల్పించే విధంగా ఇలాంటి సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తుందని, ఎన్ని వేల మెట్రిక్ టన్నులైనా కొను గోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కృష్ణా జిల్లాలో సరిపోకపోతే ఇతర జిల్లాల మిల్లులకు తరలించైనా ధాన్యం కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. వర్షాలకు దెబ్బతినే మొక్క జొన్న, జొన్న, మినుము ఏ పంటకైనా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు ప్రకారం రైతులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. ఈ పర్యటనలో మంత్రి వెంట ఉయ్యూరు ఆర్డీవో హేలా షారోన్, డీఎస్‌వో పి.పార్వతి, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనే జర్ పద్మావతి, జిల్లా వ్యవసాయాధికారి మనోహర్, మార్కెటింగ్ శాఖ ఏడీ నిత్యానందం, ఆర్టీవో శ్రీనివాసరావు పాల్గొన్నారు.