- రొయ్యల వినియోగం పెంపునకు అవగాహన
- ఆక్వా అభివృద్ధి కమిటీ ప్రతిపాదనలు
పెనమలూరు(చైతన్యరథం): స్థానిక మత్స్యకార కమిషనర్ కార్యాలయంలో మంగళ వారం జాతీయ రొయ్యల సమన్వయ కమిటీ ఏర్పాటుకు సంబంధించి అవకాశాలు, లాజిస్టిక్స్, పద్ధతులు, ఫ్లో చార్ట్ తదితర అంశాలపై చర్చించడానికి ఉన్నత స్థాయి సమా వేశం జరిగింది. హైదరాబాద్ ఎన్‌ఈసీసీ(నెక్) ఉపాధ్యక్షుడు సురేష్‌రాయుడు చిట్టూరి, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఏపీ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ) చైర్మన్ మంతెన రామరాజు, బీఎంఆర్ ఇండస్ట్రీస్ నుంచి బీద మస్తాన్‌రావు, కో- వైస్ చైర్మన్, రాష్ట్ర ఆక్వాకల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకట రమ ణారెడ్డి, ఇతర ఉన్నత స్థాయి ప్రముఖులు, ఆక్వా పరిశ్రమ వాటాదారులు, ఆక్వా రైతులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో జాతీయ రొయ్యల సమన్వయ కమి టీని ఏర్పాటుకు అందరితో చర్చించారు. జాతీయ అనే పదాన్ని తీసివేసి ఆంధ్రప్రదేశ్ అనే పదంతో కూర్పు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రాన్ ప్రొడ్యూసర్స్ కంపెనీ (ఏపీపీపీసీ)గా పేరును ప్రతిపాదించారు.
ఎన్‌పీసీసీ బదులుగా ఏపీపీపీసీ (ఆంధ్రప్రదేశ్ రొయ్యల సమ న్వయ కమిటీ)ని ఏర్పాటు చేయాలని సూచించారు. ఇది మరింత ఆచరణీయమైనదిగా, సులభమైనదిగా ఆకాంక్షించారు. ఏపీపీపీసీ ఏర్పాటు చేయుటకు విధి విధానాలపై సుదీ ర్ఘంగా చర్చించి సూచనలు తీసుకున్నారు. ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఎఫ్‌పీ వో) తరహాలో ఏపీ ప్రాన్ ప్రొడ్యూసర్స్ కంపెనీ ఏర్పాటు చేసేలా, దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకునేందుకు సాధ్యాసాధ్యాలపై చర్చించారు. ప్రముఖ సినిమా నటులు ప్రముఖ సెలబ్రిటీలతో రొయ్యల వినియోగాన్ని పెంచుటకు, గుడ్డు తరు వాత రొయ్యల్లో అత్యంత ప్రోటీన్, ఇతర పోషక విలువలు ఉన్నాయని, క్షేత్రస్థాయిలో చికెన్ అమ్మే షాపుల ద్వారా ప్రాథమికంగా 100, 250, 500 గ్రాముల ప్యాకెట్స్ రూపం లో రొయ్యలను వండుటకు, తినుటకు వీలుగా ప్యాక్ చేసి అమ్మేలా నిర్ణయించారు. ఆక్వా కల్చర్ రైతుల పంట అవసరాలు, ఆక్వా ఎగుమతులు, దేశీయ వినియోగం, ఆక్వా రొయ్యల కౌంట్ వారీగా ధరల స్థిరత్వం, పంట స్థిరత్వం, ఇన్‌పుట్ ఖర్చు నియంత్రణ, తక్కువ ధరలో ఉత్పత్తి చేసేందుకు ఉన్న పద్ధతులపై చర్చించారు.
ఏపీ ప్రాన్ ప్రొడ్యూస ర్స్ కంపెనీ (ఏపీపీపీసీ)ని ఏర్పాటు చేయడం ద్వారా దేశీయ తలసరి రొయ్యల వినియో గాన్ని పెంచవచ్చునని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో, దేశంలోని అన్ని ఇతర రాష్ట్రాలలో ఆక్వా ఉత్పత్తుల జాతీయ స్థాయి మార్కెటింగ్ వ్యూహాలను మెరుగుపరిచేందుకు అనుస రించాల్సిన విధానాలను చర్చించారు. ఈ జాతీయ రొయ్యల సమన్వయ కమిటీని అభివృ ద్ధి చేయడానికి అన్ని చర్యలు తీసుకునేలా కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. రాష్ట్రస్థాయిలో క్లస్టం, డివిజనల్, జోన్ల వారీగా ఏపీపీపీసీని ఏర్పాటు చేయడానికి, అంత ర్ రాష్ట్రీయ ఎగుమతులు పెంచుటకు నిర్ణయించారు. ఈ సమావేశంలో ఎగుమతిదారుల అసోసియేషన్ వారు గత వారంరోజుల నుంచి వాయిదా వేస్తూ వచ్చిన తరువాత మంగళవారం వివరణాత్మక చర్చల తర్వాత ఈ కింది విధంగా రొయ్యల ధరలు కౌంట్ వారీగా ప్రకటించారు. కౌంట్ 100 ధర రూ.230, కౌంట్ 90 ధర రూ.240, కౌంట్ 80 ధర రూ. 260, కౌంట్ 70 ధర రూ.280, కౌంట్ 60 ధర రూ.305, కౌంట్ 50 ధర రూ.325, కౌంట్ 45 ధర రూ.403గా నిర్ణయించారు. ఈ ధరలు 10 రోజుల వరకు అందుబాటులో ఉంచేందుకు అంగీకారం తెలిపారు. ఈ నెల 25న మరలా ధరలను సవరణ చేసేందుకు నలు గురు ఆక్వా ఫార్మర్స్, నలుగురు ఎగుమతిదారులు, అధికార ప్రతినిధులతో ధరల స్థిరీకరణ కమిటీని ఏర్పాటు చేయుటకు నిర్ణయించారు.