అమరావతి (చైతన్య రథం): సీఎం చంద్రబాబు అధ్యక్షతన శనివారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన 46వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం అవసరమైన మిగిలిన నిధులు వివిధ రూపాల్లో సమీకరించేందుకు సీఆర్డీఏ కమిషనర్‌కు అసుమతిస్తూ అథారిటీ నిర్ణయం తీసుకుంది. అలాగే, పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేసేలా.. మిగిలిన అవసరమైన నిధులను వివిధ ఆర్థిక సంస్థల నుంచి సమీకరించేందుకు సీఆర్డీఏ కమిషనర్‌కు అనుమతినిచ్చింది. ఇక, అసెంబ్లీ, హైకోర్టు భవనాల టెండర్లకు ఆమోదం తెలిపిన అథారిటీ, ఎల్ వన్‌గా నిలిచిన సంస్థలకు లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇచ్చేందుకు ఆమోదముద్ర వేసింది. అసెంబ్లీ.. బేస్‌మెంట్ G3 Gవ్యూయింగ్ ఫ్లాట్‌ఫాంలు Gపనోరమిక్ వ్యూ (బిల్డప్ ఏరియా 11.22 లక్షల చదరపు అడుగులు, ఎత్తు 250 మీటర్లు) నిర్మాణానికి టెండర్లలో ఎల్ వన్‌గా నిలిచిన సంస్థకు లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. హైకోర్టుకు సంబంధించి బేస్‌మెంట్ Gజీ G7 అంతస్తులలో (బిల్టప్ ఏరియా 20.32 లక్షల చదరపు అడుగులు.. ఎత్తు 55 మీటర్లు…) చేపట్టాల్సిన నిర్మాణానికి ఎల్ వన్‌గా నిలిచిన సంస్థకు ఎల్‌ఓఏ ఇచ్చేందుకు సీఆర్డీఏ ఆమోదం తెలిపింది.