- న్యాయం చేయాలని బాధితుల గోడు
- అర్జీలు స్వీకరించిన పీతల సుజాత, బొరగం
మంగళగిరి(చైతన్యరథం): టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం వివిధ సమస్య లపై తరలి వచ్చిన అర్జీదారుల నుంచి మాజీ మంత్రి పీతల సుజాత, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. సం బంధిత అధికారులకు ఫోన్లు చేసి ఆయా సమస్యలను తెలియజేసి వెంటనే వాటిని పరిష్కరించాలని ఆదేశించారు.
` చరణ్, రాజేష్‌లు తమ భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని చిత్తూరు జిల్లా యాదమరి మండలం యోర్ధానపల్లి గ్రామానికి చెందిన ఎం.వెంకటేశులు ఫిర్యాదు చేశాడు. వారి నుంచి తమకు ప్రాణహాని ఉందని.. దయచేసి తమకు రక్షణ కల్పించాలని వినతిపత్రం ఇచ్చారు.
` తన భూమిని కబ్జా చేయడమే కాకుండా.. చంపుతామని బెదిరిస్తున్నారని, స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని పల్నాడు జిల్లా పెదకూ రపా డు మండలం జలాల్‌పురం గ్రామానికి చందిన పువ్వాడ వెంటేశ్వరరావు అర్జీ ఇచ్చి వాపో యాడు. నాగభైరవ, హరికృష్ణ అనే వ్యక్తుల నుంచి తన భూమిని విడిపించాలని వాపోయాడు.
` నల్లా గోపీనాథ్ అనే వ్యక్తి వద్ద తాము డబ్బు ఇచ్చి భూమి కొనుగోలు చేశామని.. తర్వాత భూమిని రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నాడని ఏలూరు జిల్లా ఉం గుటూరు మండలం అక్కుపల్లి గోకవరం గ్రామానికి చెందిన నెక్కంటి కృష్ణారావు ఫిర్యాదు చేశాడు. దయఉంచి తమ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశాడు.
` తన అన్న ఆస్తిలో ఆయన వాటా అమ్ముకుని మళ్లీ తన వాటాను అక్రమంగా ఆయన పేరుపై ఎక్కించుకున్నాడని ఏలూరు జిల్లా చాట్రాయి మండలం కృష్ణారావుపాలెం గ్రామానికి చెందిన పండు తిరుపతి దాసు ఫిర్యాదు చేశారు. దీనికి అధికారులు సహకా రం అందించారని.. దయచేసి తనకు న్యాయం జరిగేలా చూసి తనకు రావాల్సిన వాటా ను తనకు ఇప్పించాలని విజ్ఞప్తి చేశాడు.
` ముగ్గురు అన్నదమ్ములమైన తమకు పెద్దల నుంచి వచ్చిన ఆస్తిని తమకు తెలియ కుండా మూడో వాడు తమ తల్లిని రిజిస్ట్రేషన్ ఆఫీసుకు తీసుకెళ్లి అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని కర్నూలు జిల్లా సి.బెలగల్ మండలం కంబదహల్ గ్రామానికి చెందిన అన్నదమ్ముల్లో ఒకరైన కురువ మల్లికార్జున ఫిర్యాదు చేశారు. దాన్ని రద్దు చేసి ఆస్తి సమానంగా వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశాడు.
` తన స్థలాన్ని కబ్జా చేశారని.. రెండుసార్లు కలెక్టరేట్‌లో అర్జీ పెట్టుకున్నా.. తనకు ఎటువంటి న్యాయం జరగలేదని పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన చల్లా శివకుమార్ తెలిపాడు. తన స్థలాన్ని కబ్జా నుంచి విడిపించి కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు.