- ప్రకాశం జిల్లా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు
- వైసీపీ పాలనలో పరిశ్రమలను పొరుగు రాష్ట్రాలకు తరిమివేశారు
- 10 నెలల్లోనే ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం
- దివాకరపల్లి సభలో ప్రజాప్రతినిధుల ప్రసంగ సారాంశం
కనిగిరి (చైతన్య రథం): ప్రకాశం జిల్లా చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజని దివాకరపల్లి సభలో పలువురు ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. సీబీజీ ప్లాంట్‌కు భూమి పూజ అనంతరం ఏర్పాటు చేసిన సభలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ.. ప్రకాశం జిల్లాలో పరిశ్రమల సాధనలో కృషిచేసిన మంత్రి నారా లోకేష్, విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సీఎస్ విజయానంద్‌కు, రిలయన్స్ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. రిలయల్స్ తన మొదటి సీబీజీ ప్లాంట్‌ను ప్రకాశం జిల్లాలో స్థాపించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు మన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవ మరువలేనిదన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్లే ఇది సాధ్యమైంది. 20 లక్షల ఉద్యోగాల కల్పనను కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత వైసీపీ ప్రభుత్వం ఉన్న పరిశ్రమలను పొరుగు రాష్ట్రాలకు తరిమివేసింది. నేడు అనేకమంది పారిశ్రామికవేత్తలు ఏపీవైపు చూస్తున్నారంటే అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషే కారణం. ఇప్పటికే 5 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది. సూపర్ సిక్స్ హామీలను నెరవేరుస్తున్నాం. రెండొందల పెన్షన్‌ను రూ.2వేలు చేశాం. జగన్‌రెడ్డి వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదేళ్లు పట్టింది. నేడు పెన్షన్ రూ.4వేలు చేయడం జరిగింది. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ రానుంది. ఎస్సీ వర్గీకరణ పూర్తిచేసి ఈ నెలలోనే నోటిఫికేషన్ ఇవ్వనున్నాం. దీపం-2 పథకం ద్వారా మహిళలకు అండగా నిలుస్తున్నాం. విద్యాసంవత్సరం ప్రారంభంనాటికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం అందజేస్తాం. ప్రకాశం జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కూటమి ప్రభుత్వం విశేషంగా కృషిచేస్తోంది. పేదల సేవలో ముఖ్యమంత్రి ఉన్నారు. ఇంటి నిర్మాణానికి నిధులిస్తున్నాం. గత ప్రభుత్వంలో మంజూరైన ఇళ్లకు కూడా సాయం పెంచడం జరిగిందని అన్నారు.
విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లోనే దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని పెన్షన్‌లను ఇస్తున్నాం. ఒక్క పెన్షన్‌లకే ఏడాదికి రూ.30వేల కోట్లు ఖర్చుపెడుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇచ్చిన హామీల ప్రకారం ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించాం. ఉచిత ఇసుకను అందిస్తున్నాం. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ మే నెలలో అందిస్తాం. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు మంత్రి నారా లోకేష్ కృషిచేస్తున్నాం. మారుమూల ప్రాంతమైన కనిగిరికి రిలయన్స్ సీబీజీ ప్లాంట్ తీసుకువచ్చారు. డీఎస్సీ ద్వారా 16వేల ఉద్యోగాలు కల్పించడం జరుగుతోంది. గుజరాత్ తర్వాత ఏపీలోనే రిలయన్స్ అత్యధికంగా లక్ష కోట్ల పెట్టుబడి పెడుతోంది. తద్వార గ్రామీణ ప్రాంతాల్లో యువతకు ఉపాధి లభిస్తుంది. నిరుపయోగ భూమిని ఉపయోగంలోకి తీసుకురావడం జరుగుతుంది.
కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి మాట్లాడుతూ.. కనిగిరి ప్రాంతంలో సీబీజీ ప్లాంట్‌ను పెట్టాలని రిలయన్స్ సంస్థను మంత్రి లోకేష్ కోరారు. అడక్కుండానే మాకు వరం ఇచ్చారు. లోకేష్ కాబోయే ముఖ్యమంత్రి. ఇలాంటి సంబంరం చేసుకుంటామని ఊహించలేదు. యువగళం పాదయాత్రలో ప్రజలు విశేష ఆదరణ చూపారు. దానిని గుర్తుపెట్టుకుని సీబీజీ ప్లాంట్‌ను మా ప్రాంతానికి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు. రిలయన్స్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ వెనుకబడిన ప్రాంతాన్ని గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నా అని పేర్కొన్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ పీఎంఎస్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనందుకు సంతోషంగా ఉంది. ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి పథంలో ముందుకెళ్తోంది. ఏపీ ఉజ్వల భవిష్యత్ కోసం మంత్రి నారా లోకేష్ గారు కృషిచేస్తున్నారు. గ్యాస్ ఉత్పత్తి కోసం కాకినాడలో ఇటీవల రిలయన్స్ సంస్థ రూ.40వేల కోట్ల పెట్టుబడి పెట్టడం జరిగింది. దేశ ఇంధన భద్రత కోసం సీబీజీ ప్లాంట్ల నిర్మాణం మరో ముందడుగు. ఏపీవ్యాప్తంగా 500 సీబీజీ ప్లాంట్లను నెలకొల్పుతాం అన్నారు.
రిలయన్స్ బయో ఎనర్జీ సీఈవో హరీంద్ర కే.త్రిపాఠి మాట్లాడుతూ.. ఇది మనందరం గర్వించాల్సిన విషయం. బయో ఫ్యూయల్ ఎకానమీలో ఇదొక మైలురాయిగా నిలుస్తుంది. గత పదేళ్లలో బయో ఫ్యూయల్ మార్కెట్ శరవేగంగా వృద్ధి చెందుతోంది. ఇప్పుడు 25 లక్షల కోట్లకు చేరుకుంది. గుజరాత్ తర్వాత ఏపీలోనే రిలయన్స్ అత్యధికంగా లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టడం పెట్టడం జరుగుతోంది. ఏపీలో పారిశ్రామిక అనుకూల వాతవారణం ఉంది. వచ్చే 2 ఏళ్లలో ఈ ప్రాంత రూపురేఖలు మారనున్నాయని అన్నారు.