- రిజిస్ట్రేషన్, రెన్యూవల్స్‌లో నిబంధనలు పాటించాలి
- సాధారణ కాన్పులకు ప్రాధాన్యం ఇవ్వాలి
- వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్
- మెడికల్ కౌన్సిల్ నూతన సభ్యులకు అభినందనలు
విజయవాడ(చైతన్యరథం): వైద్యో నారాయణో హరి అన్న నానుడిని నిజం చేస్తూ వైద్యులు నైతిక విలువలకు కట్టుబడి పనిచేయాలని వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఏపీ మెడికల్ కౌన్సిల్ నూతన సభ్యు ల ప్రమాణ స్వీకారం, పదవీ బాధ్యతల స్వీకరణ మంగళవారం జరిగింది. మంత్రి సత్య కుమార్ యాదవ్ ముఖ్యఅతిథిóగా హజరయ్యారు. ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యులుగా జి.సుజాత, కె.వెంకట సుబ్బనాయుడు, డి.శ్రీహరి, స్వర్ణ గీత, ఎస్.కేశవరావుబాబు, సి.మల్లేశ్వరిలతో మంత్రి ప్రమాణం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యుల రిజిస్ట్రేషన్, రెన్యూవల్స్‌లో నేషనల్ మెడికల్ కౌన్సిల్ ప్రకారం ఏపీ మెడికల్ కౌన్సిల్ నిబంధనలు పాటించాలని ఆదేశించారు. వైద్యులు తమ సర్టిఫికెట్లను ప్రతి ఐదే ళ్లకు ఒకసారి రెన్యూవల్ చేయించుకోవాలని, ఇది ఖచ్చితంగా అమలు చేయాలని సూచించారు. దీంతో వైద్యుల పనితీరుపై పర్యవేక్షణ పెరుగుతుందని తెలిపారు. విదేశా ల్లో ఉన్న వైద్యుల విషయంలో కొంత సమస్య ఉన్నప్పటికీ వాటిని కూడా సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని సూచించారు. వైద్యులు నైతిక విలువలు పాటించాలని, అవస రం ఉన్నా లేకపోయినా యాంటిబయోటిక్స్ వాడిరచడం, వైద్య పరీక్షల పేరుతో రోగు లు ఆర్థికంగా చితికిపోయేలా వ్యవహరించకూడదన్నారు. నేడు వైద్య వృత్తి వ్యాపారమైం దన్న విమర్శలకు చెక్ పెట్టాలని కోరారు. నేటి కాలంలో సిజేరియన్ ఆపరేషన్లు పెరిగి పోయాయని, అందుబాటులోకి వస్తున్న కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుని సాధారణ డెలివరీలు జరిగేలా వైద్యం అందించాలని సూచించారు. ఏపీఎంసీలో మొత్తం 23 మంది సభ్యులు ఉంటారని, నలుగురు ఎక్స్ అఫిషియో మెంబర్లు, 13 ఎలక్టెడ్ మెంబర్లను ఎన్ను కోవాల్సి ఉందన్నారు. అలాగే మెడికల్ కౌన్సిల్ చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నిక కూడా జరగాల్సి ఉందన్నారు. నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన గోగినేని సుజాత, కాల్వకొల్లు వెంకట సుబ్బనాయుడు, దుగ్గమాటి శ్రీహరిరావు, స్వర్ణ గీత, ఎస్.కేశవరావు బాబు, చుండూరి మల్లీశ్వరిలను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమం లో ఇన్‌చార్జి వైస్ ఛాన్సలర్ డి.ఎస్.వి.ఎల్.నరసింహం, ఏపీఎంసీ రిజిస్ట్రార్ రమేష్‌రెడ్డి, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ రాధికారెడ్డి, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.