- లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ
- ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు గొట్టిపాటి, అనగాని, పార్థసారథి
అమరావతి (చైతన్యరథం): ఏప్రిల్ 1 వ తేదీన మంగళవారం బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం, చినగంజాం మండలం, పెద్దగంజాం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘పేదల సేవలో’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసి, అనంతరం ఏర్పాటు చేసే సభలో మాట్లాడతారు. ఈ సందర్భంగా కార్యక్రమం ఏర్పాట్లను జిల్లాకు చెందిన సహచర మంత్రి అనగాని సత్య ప్రసాద్, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొలుసు పార్థసారథితో కలిసి మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోమవారం పరిశీలించారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, జిల్లా ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్‌తో కలిసి ఎన్టీఆర్ భరోసా లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి..సీఎం రాక గురించి సమాచారం అందించారు. సీఎం చంద్రబాబు రాక సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, సభా ప్రాంగణంలో ప్రజలకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.