వైసీపీ నేతల్లా దోచేసి విదేశాల్లో దోచుకోలేదు
మంచి చేస్తుంటే ఓర్వలేకే సైకోల విమర్శలు
సూపర్ 6, పీ4లకు ముడిపెట్టి తప్పుడు ప్రచారం
మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు ధ్వజం
మంగళగిరి(చైతన్యరథం): సూపర్‌సిక్స్, పీ4కు ముడిపెడుతూ తప్పుడు రాతలతో పీ4 కార్యక్రమంపై బురదజల్లేందుకు యత్నిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు, బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్‌కుమార్ మండిపడ్డారు. పీ4పై వైసీపీ సైకో మూకలు చేసే విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు.. వారిలా ఇష్టాను సారంగా దోచుకుని విదేశాల్లో దాచుకోలేదు.. ప్యాలెస్‌లు కట్టుకుని పేదలను విస్మరించ లేదు.. అడ్డదిడ్డంగా అప్పులు చేస పథకాలు అమలు చేయకుండానే తోక పత్రికకు కోట్లు కట్టబెట్టుకోలేదని ధ్వజమెత్తారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం విలేకర్ల సమా వేశంలో వారు మాట్లాడారు. ఏ కార్యక్రమం జరిగినా పాడుచేయడానికి వచ్చే మారిచు సుబాహుల్లా.. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఏ పని మొదలెట్టినా ఈ రాక్షసులు అడ్డుపడుతున్నారని.. వారికి ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు.
పేదలు ఎదగాలన్న గొప్ప ఆలోచన
అశోక్‌బాబు మాట్లాడుతూ పేదలు పేదరికం నుంచి బయటపడేందుకు వారి సంక్షే మం కోసం చంద్రబాబు నాయుడు నిత్యం కృషి చేస్తున్నారు. అందులో నుంచి చంద్రబా బుకు పుట్టిన గొప్ప ఆలోచనే పీ4 విధానం. బిలో పావర్టీ లైన్ కింద ఉన్న కుటుం బాలను గుర్తించి వారిని ఆదుకునేందుకు తీసుకొచ్చిన మంచి విధానం పీ4 విధానం. సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా ఎందరో సేవామూర్తులు సమాజ వికాసం కోసం గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. గ్రామాల్లో బడులు, రోడ్లు, ఇళ్లు నిర్మాణం వంటి సాయక కార్యక్రమాలు చేపడుతున్నారు. విప్రో, హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్ సంస్థల వంటి అధినేతలు ఇటువంటి సేవాకార్యక్రమాలకు పెద్దఎత్తున డొనేషన్లు ఇచ్చారు. వారి సోషల్ రెస్పాన్సిబులిటీ ద్వారా ఎన్నో కుటుంబాలు పేదరికం నుంచి పైకి వచ్చాయి. 25 లక్షలకు పైగా ఉన్న పేద కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తీసుకు వస్తే ప్రభుత్వంపై భారం తగ్గుతుంది. విజన్ 2020పై గతంలో ఎన్నో విమర్శలు చేశారు. నేడు విజన్ 2020 ఫలితాలు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. విజన్ 2047 లక్ష్యంతో ముందుకు వెళ్లే కార్యక్రమంలో భాగం గానే ఈ పీ4 విధానం తీసుకురావడం జరిగిందని చెప్పారు.
జగన్‌లాంటి సైకోలకు అర్థం కాదు
జగన్ లాంటి సైకో వ్యక్తులు మాత్రమే ప్యాలెస్‌లు కట్టుకుని ప్రజలను విస్మరిస్తారు.. అంతర్జాతీయంగా చూస్తే వారెన్ బఫెట్, బిల్ గేట్స్ లాంటి ఎందరో గొప్ప వ్యక్తులు వారి ఆస్తిలో 80 శాతం పేదల కోసం డొనేట్ చేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాన్నే మన రాష్ట్రంలో ప్రారంభించారు. ఒక కుటుంబాన్ని దత్తత తీసుకొని వారి కాళ్లమీద వారు నిల బడే వరకు సాయం చేయడం అనేది గొప్ప మానవతా కార్యక్రమం. ఇలాంటివి ఏ1, ఏ2, ఏ3, ఏ4లకు అస్సలు అర్థం కాదు. పీ4పై విమర్శలు చేసే స్థాయి వైసీపీకి లేదు. వైసీపీ నేతల స్థాయి 11 సీట్లు మాత్రమే. అర్థంలేని విమర్శలతో వైసీపీకే నష్టం. ల్యాండ్ శ్యాండ్, వైన్ మైన్ అంటూ దేన్ని వదలకుండా దోచుకుని విదేశాల్లో దాచుకుంటున్న వైసీపీ నేతలకు సమాజంలో అందరూ బాగుండాలన్న ఉద్దేశమే లేదు. సమాజం బాగుం డాలి.. మన చుట్టుపక్కల వారు బాగుండాలని కోరుకునే వారే సంతోషంగా ఉంటున్నా రని సైకాలజిస్టులు చెబుతున్నారు. సమాజం నుంచి వచ్చిన సంపదను.. మళ్లీ సమాజం కోసం ఖర్చు పెట్టడం ద్వారా ఒక నవ సమాజం తయారు అవుతుంది. దీన్ని అర్థం చేసుకోలేని వైసీపీ సైకోలకు మేము సమాధానం చెప్పాల్సిన అవసరం ఏముంది? పీ4 విధానం ఎంత శాతం అమలైనా.. అంత శాతం పేదరికం పోయేందుకు అవకాశం ఉం టుంది.. ప్రతి టీడీపీ కార్యకర్త దీనిని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలి. వెనుక బడిన ప్రాంతాల్లోని ప్రజలపై దృష్టి పెట్టి అక్కడి పేదరికాన్ని దూరం చేసేందకు సహకరించాలని కోరారు.
నీలి పత్రికలో తప్పుడు రాతలు
నీలాయపాలెం విజయ్‌కుమార్ మాట్లాడుతూ సమాజంలో ఉన్న కలిమి లేమిలు అంటే పేద కుటుంబాలను ఉన్నత కుటుంబాలు ఆదుకునేలా పీ4 విధానాన్ని చంద్రబాబు తీసుకురావడం హర్షించాల్సిన విషయం. పీ4 విధానం అనగానే సాక్షిలో తప్పుడు రాత లు మొదలెట్టారు. పీ4 విధానం ఎక్కడ సక్సెస్ అవుతుందో అని బురదజల్లుతున్నారు. సాక్షికి కొత్త ఎడిటర్ వచ్చినా అబద్ధాలు రాయడం మానుకోవడంలేదు. సూపర్ 6, పీ4లు వేరు వేరు కార్యక్రమాలు. సూపర్ సిక్స్‌ను డైవెర్ట్ చేయడానికే పీ4 తీసుకు వచ్చారంటూ అంబటి చెప్పడం విడ్డూరంగా ఉంది. కార్యక్రమం మొదలెట్టాగానే నాశనం చేసేందుకు వచ్చే మారీచు సుబాహుల్లాంటి రాక్షసుల్లా ఏ మంచి పనిమొదలెట్టినా.. వైసీపీ రాక్షస మూకలు అడ్డు తగిలేందుకు యత్నిస్తున్నారు. వైసీపీ నేతలు పెట్టిపోయిన అప్పులు ఈ పది నెలల్లో 30 వేల కోట్లు తీర్చాం.. ఇవే డబ్బులు ఉంటే ఎన్నో సంక్షేమ పథకాలకు ఉపయోగపడేవి. రైతులకు పెట్టిపోయిన ధాన్యం బకా యిలు రూ.1674 కోట్లు చెల్లించాం. విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.4 వేల కోట్లు అప్పు పెట్టి పోతే ఇప్పటికే మేము రూ. 1338 కోట్లు ఇచ్చాం. ఎన్టీఆర్ వైద్యసేవ కింద పెట్టిపోయి అప్పులు రూ.700 కోట్లు తీర్చాం. ఉద్యోగులకు పెట్టిన బకాయిలు, కాంట్రాక్టర్లకు పెట్టి పోయిన బకాయిలు, పోలీసులకు చెల్లించాల్సిన బకాయిలు, రాజధాని రైతులకు ఇవ్వాల్సి న కౌవులు, ఎంఎస్‌ఎంఈలకు చెల్లించాల్సిన రుణాలు, చివరకు పిల్లలకు ఇచ్చే గుడ్లు చిక్కీలకు కూడా బకాయిలు పెట్టి పోతే మేము అధికారంలోకి వచ్చాక అప్పులు కట్టాం.
ఎన్టీఆర్ విదేశీ విద్య బకాయిలు రూ.33 కోట్లు, ప్రభుత్వ బడుల్లో పనిచేసే ఆయాలు వాచ్‌మెన్‌ల ఇచ్చే జీతాలు రూ.87 కోట్లు, నీరు చెట్టు బకాయిలు 2 వేల కోట్లు ఇలా 30 వేల కోట్లు వైసీపీ నేతలు పెట్టిపోయిన బకాయిలు చెల్లించాం. ఇంకా పొంతలేని రాతలు, అబద్ధపు మాటలు మాట్లాడటానికి వైసీపీ నేతలకు సిగ్గుండాలని హితవుపలి కారు. వైసీపీ 2019 జూన్‌లో అధికారంలోకి వస్తే అమ్మఒడి 2020 జనవరిలో దాన్ని అమలు చేశారు. అదికూడా ఒక్కరికే ఇచ్చారు. అందులో ఒక సంవత్సరం ఎగనామం పెట్టారు. రైతు భరోసా, వసతి దీవెన, విద్యాదీవెన సంవత్సర కాలం పాటు ఇవ్వకుండా ముందే సాక్షిలో ఇష్టానుసారంగా యాడ్‌లు ఇచ్చుకుని డబ్బులు కొల్లగొట్టారు.. పథకా లను సక్రమంగా అమలు చేయకపోగా మళ్లీ సిగ్గులేకుండా పేదల కోసం తీసుకొచ్చిన పీ4పై విషం చిమ్ముతారా? అని ప్రశ్నించారు. పేదలకు మేలు జరుగుతుంటే వైసీపీ నేత లకు కడుపులో మండుతుంది. దీన్ని ప్రజలు గమనించాలని సూచించారు.