- జెండా ఎగురవేసిన మంత్రి కందుల దుర్గేష్
- బీచ్‌లో పరిశుభ్రతను కాపాడేలా కార్యక్రమాలు
- అంతర్జాతీయ పర్యాటకుల ఆకర్షణకు చర్యలు
- భూములు ఆక్రమిస్తే సహించేది లేదని హెచ్చరిక
విశాఖపట్నం(చైతన్యరథం): రుషికొండ బీచ్‌లో పర్యాటక శాఖ మంత్రి కందుల దు ర్గేష్ సోమవారం బ్లూ ఫ్లాగ్ జెండా ఆవిష్కరించారు. ఉదయాన్నే విశాఖ చేరుకున్న ఆయ నకు అధికారులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రుషికొండ బీచ్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్ తాత్కాలికంగా రద్దు అయిందని, తమ దృష్టికి రాగానే వెంటనే దాన్ని పునరుద్ధరించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. అంత ర్జాతీయ పర్యాటకుల ఆకర్షణకు బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్ తోడ్పడుతుందని, బీచ్ పరిశుభ్రత, అభివృద్ధికి ప్రజలు సహకరించాలని సూచించారు. బీచ్ ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచే లా పర్యాటకులు, ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. బీచ్‌కు అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు ఈ బ్లూ ఫ్లాగ్ తోడ్పడుతుందన్నా రు. బీచ్‌లోని పరిశుభ్రత, ఇతర సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత పర్యాటక శాఖపై ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖపై ప్రత్యేక శ్రద్ధ వహించిందని తెలుపుతూ విశాఖను అందంగా నిర్మించేందుకు అందరం మరింత కష్టపడదామన్నారు. ఈ క్రమంలో బాంబూ పాసింగ్ పేస్ లాంటివి ఏర్పాటు చేద్దామన్నారు.బీర్, వైన్ తదితర బీచ్ శాక్స్ ను ప్రవేశపెట్టి అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తామన్నారు. తద్వారా పర్యాటకాభివృధ్ధితో పాటు ఆర్థికంగా కూడా బలోపేతం అయ్యేందుకు అవకాశముం టుందన్నారు. ఈ అంశాన్ని సీఎం దృష్టిలో ఉంచామన్నారు. త్వరలోనే నిర్ణయం వెలు వడుతుందని భావిస్తున్నామన్నారు.
స్థానికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు
రాష్ట్రంలోని 974 కి.మీల సుదీర్ఘ సముద్రతీరంలో ఉన్న ఎన్నో బీచ్‌లలో విశాఖలోని రుషికొండ బీచ్‌కు ఒక ప్రత్యేకత ఉందని తెలిపారు. సహజ సిద్ధ అందాలు, చుట్టూ ఉన్న ప్రకృతి సంపద, భవిష్యత్ తరాల వారికి పర్యావరణ జ్ఞానాన్ని అందించేలా బ్లూఫ్లాగ్ బీచ్ తయారుకావాలని ఆకాంక్షించారు. రుషికొండ సాధారణ బీచ్ కాదని..కష్టపడి బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్ తెచ్చుకున్నామని వివరించారు. బీచ్‌లో సౌందర్యానికి, స్వచ్ఛతకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. బీచ్‌లో అంతర్జాతీయ ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. తద్వారా స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. స్థానికంగా ఉపాధి పొందుతున్న మత్స్యకారుల జీవితాలు ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత తీసుకుంటామని తెలిపారు. ఇక్కడ భూములు అన్యాక్రాంతం అయితే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. అనంతరం మంత్రి దుర్గేష్ పలువురికి లైఫ్ జాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఏపీటీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ, ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి కాట, విశాఖ జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్, పర్యాటక శాఖ అధికారులు, ఇతర అధి కారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
చందనోత్సవం నాటికి సింహాచలం ఆలయ అభివృద్ధి పనులు
రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన నవ నారసింహ క్షేత్రాల్లో ఒకటైన సింహాచల వరాహ స్వామి ఆధ్యాత్మిక క్షేత్రాన్ని కూటమి ప్రభుత్వం మరింత అభివృద్ధి చేస్తుందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. సోమవారం విశాఖ పర్యటనలో భాగంగా ఆయన సింహాచలం క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ స్కీం ద్వారా చేపడుతున్న ఆలయ అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా పరిశీలించి ఏప్రిల్ 30న చందనోత్సవం నాటికి అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మే నాటికి పనులు పూర్తి చేసి భక్తులకు పూర్తిగా వినియోగంలోకి తీసుకురావాలని తెలిపారు. గతం లో సింహాచలం దర్శనానికి వచ్చే భక్తులు కేవలం దర్శనం మాత్రమే చూసుకుని వెళ్లే వారని, ప్రస్తుతం చుట్టుప్రక్కల ప్రదేశాలను చూసే విధంగా టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేసి హోటల్స్, ఇతర మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. విశాఖలో బీచ్, అడ్వెంచర్, ఎకో, క్రూయిజ్ టూరిజంలను పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ప్రసాద్ స్కీంతో అన్నవరంలో అభివృద్ధి కార్యక్రమాలు
ప్రసాద్ స్కీం కింద అన్నవరం పుణ్యక్షేత్రంలో కూడా పనులు జరుగుతున్నాయని మంత్రి దుర్గేష్ వివరించారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేప ట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి, అంకితభావాన్ని చూసి కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున సపోర్ట్ చేసేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఏప్రిల్ నుంచి నాలుగైదు ప్రధాన కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం సహకా రంతో చేపట్టనున్నామని వివరించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ సహకారంతో రూ.99 కోట్లతో అఖండ గోదావరి, రూ.77 కోట్లతో గండికోట ప్రాజెక్టులను చేపట్టామన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టులకు టెండర్లు పూర్తయ్యాయన్నారు. గండికోటకు టెండర్ల ప్రక్రి య ప్రారంభమైన విషయం వెల్లడిరచారు. త్వరితగతిన ఆయా ప్రాజెక్టుల పూర్తికి చర్యలు తీసుకుంటామన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని బీచ్‌లకు బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చేం దుకు కృషి చేస్తున్నామని వివరించారు.