- విజన్ `2047 పదిసూత్రాల అమలుతో అన్ని రంగాల్లో ముందజ ఖాయం
- సీఎం చంద్రబాబు విజన్‌కు అనుగుణంగా ప్రణాళికలు
- అర్బన్ డెవలప్‌మెంట్‌కు కేంద్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపు హర్షణీయం
- వర్క్‌షాప్‌లో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖల మంత్రి నారాయణ
విజయవాడ (చైతన్యరథం): రాష్ట్రాన్ని 2047 నాటికి మురికివాడల రహితంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. స్వర్ణాంధ్ర` 2047పై ఒక రోజు వర్క్‌షాపును విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాలలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ విజన్ 2047లో పది సూత్రాల అమలుతో మన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో మొదటి స్థానంలో నిలపాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని తెలిపారు. 2047 నాటికి దేశంవందేళ్ల స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటుందని, ఆ సమయానికి మన రాష్ట్రాన్ని సమగ్రమైన, సమతుల్యమైన అభివృద్ధికి నమూనాగా రూపొందిస్తామన్నారు. వికసిత్ భారత్ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని సీఎం చంద్రబాబు విజన్ `2047ను రూపొందించారని పేర్కొన్నారు. విజన్ `2047లో కీలక అంశంగా అమరావతి కూడా ఉందన్నారు. అమరావతిని కేవలం మౌలిక వసతుల ప్రాజెక్ట్‌గా మాత్రమే కాకుండా నాణ్యమైన జీవన ప్రమాణాలు కలిగి ఉండేలా డిజైన్ చేశామని చెప్పారు. పట్టణాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అందించే నిధులతో రాష్ట్రంలో పట్టణాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. పట్టణాల అభివృద్ధికి ప్లానర్‌లు, ఆర్కిటెక్ట్‌లు తమ వంతు సహకారం అందించాలని కోరారు.
20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్ లంకా దినకర్ మాట్లాడుతూ వ్యూహాత్మక పెట్టుబడులు, సహకారం ద్వారా స్థిరమైన పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల వృద్ధి, సాధ్యపడుతుందన్నారు. దేశంలో ఏపీని ప్రముఖ రాష్ట్రంగా తీర్చిదిద్దటానికి ఒక రోడ్ మ్యాప్‌ను రూపొందిస్తున్నామన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్ మాట్లాడుతూ ప్రతి పనికి ఒక ప్రణాళిక అవసరమని, ఒక్క రోజులో అద్భుతాలు జరగవన్నారు. మన రాష్ట్రాన్ని దేశంలోనే ప్రత్యేకంగా తీర్చిదిద్దటానికి పక్కా ప్రణాళిక అవసరమని, ఆ దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. నిత్యకృషి ఉత్తమ ఫలితాలను ఇస్తుందని తెలిపారు. మన దేశంలో ప్రణాళికాబద్ధంగా నిర్మించిన నగరాలు లేవన్నారు. ఇప్పటికీ వరదల సమయంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటున్నామని, కాని అమరావతిని ఒక చక్కటి ప్లాన్‌డ్ సిటీగా రూపొందిస్తున్నామన్నారు. క్లీన్, గ్రీన్ సిటీగా అమరావతి నిలవనుందన్నారు. అనంతరం నీతి అయోగ్, ఆర్థిక సలహా విభాగాలకు చెందిన నిపుణులు.. ప్రజా విధానం, పట్టణ పాలన, పట్టణ ప్రణాళిక, తదితర అంశాలపై తమ విలువైన సూచనలు, సలహాలను అందించారు. కార్యక్రమంలో టీసీపీవో చీఫ్ ప్లానర్ ఎన్. ధీరేన్, డాక్టర్ అమోఫ్‌ు కుమార్ గుప్తా, డాక్టర్ రమేష్ శ్రీకొండ, తదితరులు పాల్గొన్నారు.