- మేనిఫెస్టో హామీల్లో 85శాతం ఎగనామం..
- నీతిభోధనలు చేస్తున్నది అవినీతి సాక్షి మీడియానే
- వర్ధెల్లి మురళి అబద్దాల కుతంత్రం – 14
09.03.2025 ఆదివారం అవినీతి విషపుత్రిక సాక్షిలో తన యజమాని అవలక్షణాల్ని చంద్రబాబుకు అంటగడుతూ సుదీర్ఘ వ్యాసం మరొకటి రాశారు వర్ధెల్లి మురళి. అందులో ‘‘తెరవెనుక కత్తుల కోలాటమాడుతున్న వారు తెర ముందుకొచ్చి శాంతి కపోతాలు వదులుతున్నారు -రోత చేష్టల రంగమార్తాండులు శ్రీరంగనీతులు బోధిస్తున్నారు – ‘అదిగో దొంగ-ఇదిగో దొంగ’ అంటూ గజదొంగలే అరుస్తున్నారు’’ అంటూ తన యజమాని కుటుంబ కత్తుల కోలాటాన్ని.. రవంతైనా నేరచరిత్రలేని నారావారికి అంటగట్టే కుతంత్రపు రాత వర్ధెల్లి మురళి రాశారు. సహవాసదోషంతో వర్ధెల్లి మురళి కత్తుల భాషతో, రోత రాతలతో కోలాటం ఆడుతున్నాడు. గజదొంగ ఎవరు? కత్తులు, గొడ్డలితో కోలాటం ఆడుతున్నది ఎవరు? – 2004లో రెండు కోట్లలోపు ఆస్తులున్నట్టు తన ఎన్నికల అఫీడెవిట్‌లో జగన్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మరి నేడు లక్షల కోట్లు విలువ కలిగిన 50కి పైగా (సూట్ కేస్ కంపెనీలతో కలిపి) కంపెనీలు ఎలా వచ్చాయి? ఈ రేంజ్‌లో పెరిగిన నేతలెవరూ దేశంలోనే లేరు. ఇదీ గజదొంగ తనం. ఎత్తుకొని పెంచిన చిన్నాన్నను క్రూరంగా గొడ్డలితో నరికి.. నరికి చంపించిన వారిని కాపాడుతున్నది ఎవరో ప్రజలందరికీ తెలుసు.
గొడ్డలి వేటును గుండె పోటుగా రోత ప్రసారాలు చేసింది సాక్షి మీడియా కాదా? ‘నారాసుర రక్తచరిత్ర’ అంటూ రోత రాతలు రాసింది సాక్షి పత్రిక కాదా? చివరకు తల్లి, చెల్లి, సోదరిల వ్యక్తిత్వ హననం చేసిన రోతగాళ్ళను కాపాడుతున్న వారి తరఫున వర్ధెల్లి మురళి శ్రీరంగ నీతి రాతలు రాస్తున్నారు. మీ యజమాని గజదొంగ తత్వాన్ని, సాక్షి మీడియా రోత మార్తాండాన్ని నారావారికి ఆపాదిస్తే ప్రజలు తగు బుద్ధి చెబుతారు. ప్రజాస్వామ్య పంథాలోకి మారకుండా ఇంకా హత్యా రాజకీయ పంథా, అబద్దాల పంథా, కుట్రల పంథాతోనే తిరిగి అధికారానికి వస్తాం అనుకుంటే అది పగటి కలే అవుతుంది. హత్యారాజకీయాలు, బందిపోటు రాజకీయాలు చేసిన వారి హవా స్వల్ప కాలమేనని చరిత్ర రుజువు చేసింది. అందుకు తాజా ఉదాహరణగా విజయసాయిరెడ్డి, జయలలిత నెచ్చలి శశికళ ఉదంతాలే నిదర్శనాలుగా నిలిచివున్నవి. ‘‘అతి సర్వత్ర వర్జయేత్’’ అనేది వేదవాక్కు. దోపిడీలో మీ యజమాని, అతని ముఠా లక్ష్మణ రేఖ దాటింది కనుక ప్రజలు ఇప్పటికే బుద్ధి చెప్పారు. సరైన ఆత్మవిమర్శ చేసుకోకపోతే వైకాపా మనుగడే ప్రశ్నార్ధకమవుతుంది. కుటుంబ కక్షలకు దోపిడీ డబ్బుపై ఆధారపడకూడదని కుటుంబం కోసం 1994లో అంటే 30 ఏళ్లకు పూర్వం చంద్రబాబు హెరిటేజ్‌ను స్థాపించారు.
నందమూరి తారక రామారావు కుమార్తె భువనమ్మ 30 ఏళ్ల నుండి ఒక్క హెరిటేజ్ కంపెనీకే పరిమితమయ్యారు. చట్టబద్ధంగా వ్యాపారం చేస్తున్నారు. జగన్ కుటుంబానికి ఉన్నట్లు చంద్రబాబు కుటుంబానికి డజన్ల కొలది కంపెనీలు లేవు. హెరిటేజ్ కంపెనీ ఏనాడూ ప్రభుత్వ నుండి లబ్ధి పొందలేదు. జగన్ కంపెనీలు ప్రభుత్వం నుండి అయాచిత లబ్ధి పొందినందున వాటిపై సీబీఐ చార్జిషీట్లు కోర్టుకు సమర్పించింది. దీన్నిబట్టి ఎవరు గజదొంగలో వర్ధెల్లి మురళికి తెలియదా? అలాగే నారావారి తాత ముత్తాతలకు నేర చరిత్ర లేదు. ఆ కుటుంబంపై హత్యా నేరాల కేసులు లేవు. నారావారిది వ్యవసాయ కుటుంబం. కఠోర శ్రమతో, చట్ట పరిధికి లోబడి ఎదిగింది నారావారి కుటుంబమని ప్రజలకు తెలుసు. అందుకే అక్రమ కేసులతో చంద్రబాబును 53 రోజులు జైల్లో పెడితే వందకుపైగా దేశాల్లో నిరసన ప్రదర్శనలు చేశారు. 164 సీట్లతో అధికారమిచ్చారు. జగన్ ఒక ఛాన్స్ పేరుతో, తండ్రి అకాల మరణం సానుభూతితో అధికారానికి వచ్చారు. జగన్ జైలుకెళితే ప్రజలు నిరసనలు తెలపలేదు ఎందుకని?
చంద్రబాబు శాంతి కపోతం
హైదరాబాదును మత మారణ హోమంగా వైఎస్ కుటుంబం మారిస్తే.. అక్కడ చంద్రబాబు శాంతికపోతం ఎగరవేశారు. రాయలసీమలో ఫ్యాక్షన్ కుటుంబాల్ని కలిపి రక్తపాతాన్ని నివారించి శాంతికపోతం ఎగరవేశారు. మాఫియాల ఆట కట్టించి ప్రజల ధన, మాన, ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పించిన ప్రజాస్వామ్యవాది చంద్రబాబు.
నేరమే అధికారమైంది జగన్ పాలనలోనే..
నేరమే అధికారమై ప్రశ్నిస్తున్న ప్రతి వాడిమీద నేరస్తుడనే ముద్ర వేసే ధోరణిని ఆదిలోనే ప్రతిఘటించకపోతే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది. అధికారానికి రావడానికి అసత్యాలు, అభూత కల్పనలకు ఒడిగట్టారు అని మురళి వైకాపా లక్షణాన్ని కూటమికి అంటగట్టే కుట్ర చేశాడు. 2019-24 మధ్య నేరమే అధికారమై ప్రశ్నించిన ప్రజల్ని చిత్రవథ చేశారు. చివరకు హత్యలు చేశారు. మాస్క్ అడిగిన పాపానికి దళిత డాక్టర్ సుధాకర్‌ను చిత్రవధ చేశారు. మద్యం మాఫియాను ప్రశ్నించిన దళిత యువకుడు ఓంప్రతాప్ పుంగునూరులో శవమై తేలాడు. ఇసుక మాఫియాను ప్రశ్నించిన వరప్రసాద్‌కు పోలీస్ స్టేషన్లో గుండు కొట్టారు. గంజాయి మాఫియా అనంతబాబు దళిత డ్రైవర్ సుబ్రమణ్యాన్ని హత్యచేసి డోర్ డెలివరీ చేశారు. జై జగన్ అనలేదని మాచర్లలో తోట చంద్రయ్యలాంటి అనేకమంది బీసీ నేతలను హత్యలు చేశారు. సోషల్ మీడియాలో పోస్ట్ ఫార్వర్డ్ చేసిందని వృద్ధురాలు రంగనాయకమ్మ, జర్నలిస్టు అంకబాబులపై అక్రమ కేసులు పెట్టి వేధించారు. అమరావతి మహిళా రైతులపై అక్రమ కేసులు పెట్టి, లాఠీ దెబ్బలతో వందలాదిమందిని హింసించారు. రైతులకు, ప్రజలకు అండగా ఉండి మాఫియాలను ఎక్స్‌పోజ్ చేసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, ఏబీఎన్, ఈటీవీలను అసెంబ్లీకి రాకుండా నిషేధించారు. ప్రశ్నించిన ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలను ధ్వంసం చేశారు, దగ్దం చేశారు. ఇళ్లపైపడి ధ్వంసం చేశారు. పవన్ కళ్యాణ్ బిడ్డల పుట్టుకపై నిందలు వేశారు. చంద్రబాబు సతీమణిపై ప్రజాస్వామ్య సౌధం అసెంబ్లీలోనే నిందలు వేస్తుంటే… ఆనాటి సీఎం జగన్ ఆనందించారు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్, గంజాయి, డ్రగ్స్, ఎర్రచందనం, రేషన్ బియ్యం మాఫియాలుగా మారి సహజ వనరుల్ని, ప్రభుత్వ ఖజానాను లక్ష్మణ రేఖ దాటి కొలగొట్టారు.
ఇది నేరమని ప్రశ్నించినవారిమీద నేరస్తుడనే ముద్ర వేశారు. వేలాది అక్రమ కేసులు పెట్టారు. ప్రశ్నిస్తున్న వారిని నేరస్తుడని ముద్ర వేయడం ఖచ్చితంగా తప్పు. నిజమైన నేరస్థుడిని చట్టంముందు నిలబెట్టి శిక్షించకపోతే కూడా తప్పే అవుతుంది. వివేకా హంతకులకు శిక్ష పడకపోతే రేపు ఎవరి ప్రాణాలకైనా రక్షణ ఉంటుందా? సాక్షులు, వారితో సంబంధం ఉన్నవారు ఒక్కొక్కరు చనిపోవడం మిస్టరీ కాదా? గతంలో పరిటాల హత్య సాక్షులు కూడా ఇలానే అయ్యారు. మిస్టరీ డెత్‌లు జరిగాయి. మిస్టరీ మరణాల్ని నిగ్గు తేల్చకపోతే రేపు పౌరుల ప్రాణాలుకు రక్షణ ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ బిడ్డల పుట్టుకపై నిందలు వేసిన పోసాని మురళిపై పెట్టినవి సక్రమ కేసులేగాని అక్రమ కేసులు ఎలా అవుతాయి? మహిళల శీలహననం చేసిన ఉన్మాదులపై, మాఫియా, నరహంతకులపై కేసులు పెట్టకపోతే ఆటవిక రాజ్యమవుతుంది. ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఇంటిపై దాడి చేశారు. ఆయన నందిగామ, ఎర్రగొండపాలెం, అంగళ్లు పర్యటనలపై దాడులు చేసి అక్రమ కేసులు పెట్టారు. నేడు జగన్ స్వేచ్ఛగా పర్యటనలు చేయగలుగుతున్నారు. పోలీసుల్ని, కూటమి నేతల్ని బెదిరిస్తున్నారు. దూషిస్తున్నారు. అయినా జగన్ ఇంటిపై దాడులు లేవు. వైకాపా కేంద్ర కార్యాలయాన్ని ధ్వంసం చేయలేదు. చట్ట ప్రకారం కేసులు మాత్రమే పెడుతున్నారుగాని చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం లేదు. వైకాపా పాలనలో ప్రశ్నించిన ప్రజలు, మీడియా, ప్రతిపక్షాన్ని నేరస్తులని ముద్రవేశారు. వారిపై దుష్ప్రచారం చేశారు. వారి శీల హననం చేశారు. సజ్జల భార్గవ్‌రెడ్డి, ఐప్యాక్ ఆధ్వర్యంలోని వ్యవస్థీకృత సోషల్ మీడియా ఉన్మాదుల పైన మాత్రమే కేసులు పెడుతున్నారు. వీరిపై కేసులు పెట్టకపోతే రాష్ట్రంలో ఏ ఒక్క మహిళ శీలానికి రక్షణ ఉండదు. జగన్ పాలనలో ప్రజలు స్వేచ్ఛ కోల్పోయారు. కూటమి పాలనలో ప్రజలు స్వేచ్ఛ అనుభవిస్తున్నారు. జగన్ పాలనలో మాఫియాలు చెలరేగిపోయాయి. కూటమిపాలనలో ప్రజాస్వామ్యం వర్ధిల్లుతోంది. ఆనాడు కౌరవ సభగా మారిన అసెంబ్లీ నేడు గౌరవ సభగా మారి ప్రజా సమస్యలు చర్చించబడుతున్నాయి.
85శాతం హామీల అమలుకు ఎగనామం పెట్టింది జగనే
మేనిఫెస్టో హామీలపై మాట తప్పి మడమ తిప్పింది మీ యజమాని గారే కదా వర్ధెల్లి మురళి గారూ! మద్యనిషేధంపై మాట తప్పి, విషపూరిత మద్యం పోసి 35 లక్షలమంది పేదల ఆరోగ్యాలు గుల్ల చేశారు. మద్యం ధరలు మూడు రెట్లు పెంచి పేదల సంపాదన లక్ష కోట్లు కొల్లగొట్టారు. యేటా డీఎస్సీ జరుపుతామని హామీ ఇచ్చి ఐదేళ్లలో ఒక్క ఉపాధ్యాయ నియామకం చేయలేదు. ఒక్కొక్కరికి రూ.15వేల చొప్పున ఇద్దరు బిడ్డలకు అమ్మబడి ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పి ఒక్కరికే రూ.13,000కు కుదించారు. ఇలానే పీఆర్సీ, సీపీఎస్‌పై హామీ ఇచ్చి మడమతిప్పి రివర్స్ పీఆర్సీ ఇచ్చారు. ఉద్యోగులు, పెన్షనర్లకు రూ.26 వేల కోట్లు బకాయిలు పెట్టారు. ఇలా మ్యానిఫెస్టో హామీల్లో 85శాతం ఎగనామం పెట్టారు. పైగా ధరలు, చార్జీలు, పన్నుల బాదుడుతో ప్రజల్ని పీల్చి పిప్పి చేశారు. పది ఇచ్చి పేదల వద్ద వంద కొట్టేశారు. తమ అనుభవంతో పేదలు జరిగిన మోసం గుర్తించి 2024 ఎన్నికల్లో వైకాపాకు వాతలు పెట్టారు. 2019లో అధికారానికి వచ్చిన జగన్ అమ్మబడి వెంటనే ఇవ్వలేదు. 2020లోనే అమ్మబడి ఇచ్చారు. 87 లక్షల పిల్లలుంటే 42 లక్షల మందికే ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం ఢల్లీి పబ్లిక్ స్కూల్‌లాంటి వాటిలో చదివే సంపన్నుల పిల్లలు మినహా మిగిలిన దాదాపు 75 లక్షల మంది పిల్లలకూ ఒక్కొక్కరికి రూ.15వేలు చొప్పున మేనెల నుంచి తల్లికి వందనం నారా లోకేష్ ఇవ్వబోతున్నారు.
రైతు భరోసాకు రాష్ట్ర నిధుల నుండి జగన్ రూ7,500 ఇవ్వగా.. చంద్రబాబు అన్నదాత సుఖీభవకు రూ 14,000 ఇవ్వబోతున్నారు. మొదటి ఏడాది జగన్ పింఛన్ల పెంపు రూ.250 మాత్రమే ఇవ్వగా.. చంద్రబాబు రూ.1,000కి పెంచారు. చంద్రబాబు ఆరు లక్షల మందికి గతంలో నిరుద్యోగభృతి ఇవ్వగా, జగన్ దాన్ని రద్దు చేశారు. ఇలానే జగన్ అన్నింట చంద్రబాబు కన్నా చాలా తక్కువే చేశారు. అంతేకాక రైతు రుణమాఫీ, పసుపు కుంకుమ, విదేశీ విద్య, పండగ కానుకలాంటి 120 చంద్రన్న సంక్షేమ పథకాలు రద్దు చేశారు. వీటితోపాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్ళించి సామాజిక న్యాయం గొంతు కోశారు. హామీల అమలు గురించి వర్ధెలి మురళి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. బడ్జెట్ అప్పులు మాత్రమే రాష్ట్ర బడ్జెట్ పుస్తకాల్లో చూపడం ఆనవాయితీ. బడ్జెటేతర అప్పులు, బకాయిలు జగన్ రెడ్డి ప్రభుత్వం భారీగా చేసింది. ఒక్క బకాయిలే రూ 1.4 లక్షల కోట్లు పెట్టారు. బడ్జెట్ అప్పులకు బకాయిలు, కార్పొరేషన్ల బడ్జటేతర రుణాలు వగైరాలు కలిపి రాష్ట్ర అప్పు రూ.10 లక్షల కోట్లు ఉన్నది వాస్తవం. ఏడాదికి వడ్డీ, అసలు కలిపి రూ.66 వేల కోట్లు ఇప్పుడు చెల్లించాలనేది నిజం. దీంతోపాటు జగన్ పెట్టిన బకాయిలు1.40 లక్షల కోట్లు చంద్రబాబు చెల్లించాలి. ఇది నిజం.
గురజాల మాల్యాద్రి
చైర్మన్, టీడీపీ నాలెడ్జి సెంటర్.