- పరీక్ష రద్దుకు నిర్ణయం
- బాధ్యులపై కఠినచర్యలకు ఆదేశం
అమరావతి (చైతన్యరథం): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్‌యూ) బీఎడ్ పరీక్షా పత్రం లీకేజి అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తోందని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు జరగాల్సిన ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్‌మెంట్ పరీక్షకు సంబంధించి ప్రశ్నాపత్రం నిర్ణీత సమయానికి ముందే సోషల్ మీడియాలో లీక్ కావడంపై విచారణ జరిపించాల్సిందిగా ఉన్నత విద్యాశాఖ అధికారులను ఆదేశించామన్నారు. అలాగే పరీక్షను రద్దు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇటువంటి సంఘటనలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యాశాఖ అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు.