- ఆస్తిలో హక్కు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు
- పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేలా ప్రణాళిక
- మహిళా దినోత్సవ వేడుల్లో మంత్రి నారాయణ
- స్వయం సహాయక సంఘాల సభ్యులకు అవార్డులు
కాకినాడ(చైతన్యరథం): పురుషులతో సమానంగా మహిళలకు సమాన అవకాశాలు కల్పించినప్పుడే మహిళా సాధికారత సార్థకత అవుతుందని మంత్రి నారాయణ పేర్కొ న్నారు. కాకినాడలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో మంత్రితో పాటు ఎంపీ ఉదయ్‌శ్రీనివాస్, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్ షాన్‌మోహన్, ఎస్పీ బిందుమాధవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలోనే మహిళా సాధికారత కోసం అనేక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. మహిళలకు ఆస్తిలో సమాన వాటా, చట్టసభలు, విద్యాసంస్థల్లో రిజ ర్వేషన్‌లు కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించాలనే ఉద్దేశంతో 2014-19 మధ్య సీఎం చంద్రబాబు డ్వాక్రా మహిళలకు ఇసుక రీచ్‌లు అప్పగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల అభి వృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తుందని వివరించారు.
మహిళలను ఆర్థికంగా పైకి తీసుకురావాలనే పట్టుదలతో సీఎం చంద్రబాబు ఉన్నారు. ఎన్నికల హామీల్లో మహిళల కోసం అనేక పథకాలు పొం దుపరిచాం..ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లను పంపిణీ చేస్తున్నాం..మహిళలకు త్వరలోనే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభం కానుంది..తల్లికి వందనం ద్వారా ప్రతి విద్యార్థికి 15 వేల చొప్పున తల్లుల ఖాతాల్లో మే లోగా జమ చేస్తామని చెప్పారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి పారిశ్రా మికవేత్తలుగా తయారు చేస్తున్నాం.. సుమారు 73 లక్షల మంది మహిళల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. జిల్లాలో 558 ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు రూ.100 కోట్ల రుణం ఇచ్చినట్లు చెప్పారు. ఓఎన్‌డీసీ ద్వారా 78 వేల మంది మహిళలకు 39 లక్షల మేర లబ్ధి చేకూర్చాం. పీఎం ఈజీపీ ద్వారా ముగ్గురు మహిళా పారిశ్రామికవేత్తలకు కోటి రుణాలు అందించినట్లు చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపనకు 20 మంది మహిళలకు 2.36 కోట్ల ఆర్థిక సాయం, మెప్మాలో ఓఎన్‌డీసీ ద్వారా 4513 మందికి 7 లక్షల ప్రోత్సాహకాలు అందజేసినట్లు వివరించారు. ర్యాపిడో సంస్థతో కలిసి మెప్మాలోని 25 మంది మహిళలకు ఎలక్ట్రిక్ వాహనాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఇంటిలో ఒక మహిళ వ్యాపారవేత్త ఉండాలనే సీఎం ఆకాంక్షను నెరవేరుస్తారని కోరుకుంటున్నట్లు తెలిపారు.