- సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు
అమరావతి (చైతన్యరథం): ఎస్సీ, బీసీలకు పదవులు కేటాయించడంలో, ప్రాధాన్యత ఇవ్వడంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ఆదర్శంగానే ఉంటారని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. టీడీపీ అంటేనే బీసీల పక్షపాతి అన్నారు. ప్రాంతాలు, సామాజికవర్గాలకు సమన్యాయం చేస్తూ టీడీపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బీసీల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపికైన కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడులకు అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు.