- 20న సీఎం చేతులమీదుగా బహుమతులు
- స్పీకర్ అయ్యన్నతో చర్చించిన మండిపల్లి
అమరావతి(చైతన్యరథం): స్పీకర్ అయ్యన్నపాత్రుడితో ఆయన చాంబర్‌లో రవాణా, యువజన, క్రీడల మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, శాప్ చైర్మన్ రవినాయుడు, ఎండీ గిరీషా సమావేశమయ్యారు. ఈ నెల 18 నుంచి 20 వరకు ఎమ్మెల్యేలకు క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా మార్చి 18, 19, 20 తేదీల్లో ఎమ్మెల్యేల కోసం క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలనే ఉద్దేశంతో పాత సంప్రదాయాన్ని పునరుద్ధరించనున్నట్లు స్పీకర్ అయ్య న్నపాత్రుడు ఈ సందర్భంగా తెలిపారు. ఈ పోటీలు రాజకీయ ఒత్తిడిని తగ్గించడంతో పాటు సభ్యుల్లో స్నేహభావాన్ని పెంపొందించేందుకు ఉపయోగపడతాయన్నారు. పురుష ఎమ్మెల్యేల కోసం క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ పోటీలు, మహిళా ఎమ్మెల్యేల కోసం బ్యాడ్మింటన్, త్రో బాల్, టెన్నీకాయిట్, టగ్ ఆఫ్ వార్, వంద మీటర్ల పరుగు పందెం వంటి క్రీడలు నిర్వహించడంపై చర్చించారు. అలాగే పాటలు, నాటకాలు, స్కిట్లు, నృ త్యం, ఏకపాత్రాభినయం వంటి సాంస్కృతిక కార్యక్రమాలపై సమావేశంలో చర్చించారు. మార్చి 20న సీఎం చంద్రబాబు చేతులమీదుగా బహుమతుల ప్రదానం చేయాలని నిర్ణ యించారు. ఈ పోటీలు ఉత్సాహభరితంగా సాగాలని, ప్రతి ఒక్క ఎమ్మెల్యే పాల్గొనాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు కోరారు. ఈ సమావేశంలో విప్ గణబాబు, ఎమ్మెల్యేలు కె.ఎస్. ఎన్.ఎస్.రాజు, ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు.