- అటవీ అనుమతుల్లో జాప్యంతోనే ఆలస్యం
- మండలిలో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సమాధానం
అమరావతి(చైతన్యరథం): శాసనమండలిలో కడప – రేణిగుంట నూతన జాతీయ రహదారుల పనుల విషయమై ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి, దువ్వారపు రామారావు, బి.తిరుమలనాయుడు అడిగిన ప్రశ్నలకు రోడ్లు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సమాధానమిచ్చారు. కడప రేణిగుంట కొత్త జాతీయ రహదారి పనులు ఇంకా ప్రారంభం కాలేదన్న మంత్రి.. అటవీ, వన్యప్రా ణుల అనుమతులు పొందడంలో ఆలస్యం జరిగిందని వివరించారు. అటవీ అనుమతి (1వ దశ)ని వన్యప్రాణుల అనుమతి ఇవ్వడానికి లోబడి గత ఏడాది డిసెంబర్ 12న పొందడమైందని తెలిపారు. నాలుగు లేన్ల పనులు ప్రారంభంపై ప్రభావం చూపే వివిధ కారణాల వల్ల అటవీ /వన్య ప్రాణుల/ ఈఎస్‌జెడ్ అనుమతులు పొందడంలో ఆలస్యం అయిందని చెప్పారు. అటవీ శాఖ అనుమతి పొందడానికి ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్ 21న వన్యప్రాణుల జాతీయ సంస్థ (ఎస్‌సీ-ఎన్‌బీడబ్ల్యూఎల్) స్థాయి కమిటీ వన్యప్రాణుల అనుమతి ప్రతిపాదనపై 81వ సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. ఆ చర్చల ప్రకారం పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు (ఎంఓఈఎఫ్ సీసీ) మంత్రిత్వ శాఖ, నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ (ఎన్టీసీఏ) భారత వన్యప్రాణుల సంస్థ (డబ్ల్యూ ఐఐ), ఏపీ అటవీ శాఖ, యూజర్ ఏజెన్సీ (ఎన్‌హెచ్‌ఐఐ) ప్రతినిధులతో కూడిన ఒక కమిటీ జంతువుల పాసేజ్ ప్లాన్ పరిశీలించడానికి ఫిబ్రవరి 24, 25 తేదీల్లో సైట్‌ను సందర్శించినట్లు చెప్పారు. వారి నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని, ఆ నివేదికతో పాటు వన్యప్రాణుల అనుమతి ప్రతిపాదనను 82వ ఎస్సీ-ఎన్‌బీడబ్ల్యూఎల్ సమావేశం లో స్థాయి కమిటీ పరిశీలనకు ఉంచడం జరుగుతుందని తెలిపారు. ఏప్రిల్ నాటికి వన్యప్రాణుల అనుమతి వస్తుందని భావిస్తున్నట్లు వివరించారు. రెండు ప్యాకేజీలకు సం బంధించిన ఒప్పందాలు అనగా, ఎస్‌హెచ్716లోని కడప చిన్నఓరంపాడు, చిన్న ఓరంపాడు – రేణిగుంట సెక్షన్ల 4 లేన్ల కోసం జనవరి 28న రాయితీదారులతో సంతకం చేయడం జరిగింది. రెండు ప్యాకేజీలను జూన్ చివరి నాటికి ప్రారంభం అయ్యే అవకా శం ఉందని భావిస్తున్నట్లు చెప్పారు.
కడప`రేణిగుంట రోడ్డు పూర్తి చేయడానికి మా ప్రభుత్వంలో చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు.. గుంతల రహిత రోడ్ల మరమ్మత్తుల్లో భాగంగా రూ.44 కోట్లు కేటాయించి పనులు పూర్తి చేశామన్నారు. నెలరోజుల్లోపు కడప రేణిగుంట రోడ్డు మరమ్మతు పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తున్నాం. ఈ రోడ్డు పూర్తిగా అటవీ అనుమతితో కూడి న వ్యవహారం అయినందున ఇప్పటికీ 3-4 సార్లు సంబంధిత అధికారులతో శాఖా పరమైన సమీక్షలు నిర్వహించడం, ఆ రోడ్డును స్వయంగా సందర్శించడం జరిగిందని చెప్పారు. అటవీ శాఖ అనుమతులపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి, అటవీ అనుమతులు క్లియరెన్స్ కోసం ప్రయత్నిస్తామని చెప్పారు. త్వరలోనే అన్ని అనుమతులు పూర్తి చేసి రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలోని అన్ని రహ దారులు గుంతలమయమై పెట్టుబడుదారులు కూడా పారిపోయే పరిస్థితి తెచ్చారని మం డిపడ్డారు.
నేడు కూటమి పాలనలో గుంతలమయమైన దాదాపు 22 వేల కి.మీ రాష్ట్ర రహదారుల్లో దాదాపు 18 వేల కి.మీ రోడ్లను 3 నెలల స్వల్ప వ్యవధిలోనే 85 శాతం రోడ్లను గుంత లరహితంగా తీర్చిదిద్దినట్లు వివరించారు. గత ప్రభుత్వం కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలు సైతం చెల్లించడం జరిగిందని చెప్పారు. నాబార్డు ద్వారా గత ప్రభుత్వంలో చేయాల్సిన రోడ్ల పనులు సైతం గత ప్రభుత్వంలో ఒప్పందాలకే పరి మితమయ్యే దుస్థితి ఉందన్నారు. సొంత కుటుంబసభ్యులకు గత ఐదేళ్లలో కాంట్రాక్టులు కేటాయించి పనులు పూర్తి చేయకుండా దౌర్భగ్య పరిస్థితిలో రాష్ట్రాన్ని నెట్టారని విమ ర్శించారు.