- వైసీపీ నేతల అండతో రూ.300 కోట్ల స్వాహా
- గత ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయి
- విచారణకు ఆదేశించాలని గ్రీవెన్స్‌లో ఫిర్యాదు
- అర్జీలు స్వీకరించిన రవినాయుడు, డూండి రాకేష్
మంగళగిరి(చైతన్యరథం): విశాఖపట్నం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌లో నాడు వైసీపీ నేతల అండతో దాదాపు రూ.300 కోట్ల కుంభకోణం జరిగిందని..ఇందుకు కార కులైన అధికారులు ఇంకా విధుల్లో కొనసాగుతున్నారని అనకాపల్లికి చెందిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వి.పైడారావు ఫిర్యాదు చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ప్రజావినతుల్లో ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు. ఘటనపై పూర్తిగా విచారణ జరిపించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. శాప్ చైర్మన్ రవినాయుడు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్ అర్జీలు స్వీకరించారు.
` ఆళ్ల రాజా అనే వ్యక్తి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరావు అండతో తమ ఇం ట్లోకి తాగి వచ్చి తమ ఆడ వారిపై దాడి చేయడమే కాకుండా తిరిగి తమపైనే అక్రమ కేసులు పెట్టారని తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలానికి చెందిన శేషగిరి ఆవేదన వ్యక్తం చేశారు. తాము స్టేషన్ వెళ్లి వారిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు తీసు కోవడం లేదని ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
` తమ భూమిని పక్కవారు ఆక్రమించుకున్నారని.. దీనిపై అధికారులకు ఎన్ని సార్లు అర్జీలు పెట్టుకున్నా పట్టించుకోవడం లేదని తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం పాతూరు గ్రామానికి చెందిన పి.బత్తెమ్మ ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
` తాము గతంలో కొనుగోలు చేసిన భూమికి అన్ని రికార్డులు ఉన్నా 22ఏలో పెట్టా రని కృష్ణా జిల్లా గన్నవరం మండలం నున్న గ్రామానికి చెందిన జె.లక్ష్మీనారాయణ తెలి పారు. తమ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోరారు.
` సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలానికి చెందిన తవలం వెంకట రమణ సమస్యను వివరిస్తూ తమ నాయనమ్మకు ప్రభుత్వం ఇచ్చిన భూమి వారసత్వంగా తమకు రావాల్సి ఉండగా సర్పంచ్ బంధువులు ఆ స్థలాన్ని కబ్జా చేశారని ఫిర్యాదు చేశారు. వారి నుంచి తమ స్థలాన్ని విడిపించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
` తమ తండ్రి నుంచి తమకు వారసత్వంగా వచ్చిన భూమిని అన్నదమ్ములం పంచుకుని పన్ను కట్టి అనుభవిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం విన గడప గ్రామానికి చెందిన నాగళ్ల నరసింహారావు తెలిపారు. కొవిడ్ సమయంలో కొంత కాలం ఆ భూమి వైపు వెళ్లకపోవడంతో బరోతు సోమ్లానాయక్ అతని కుమారులు ఆ భూమిని ఆక్రమించుకుని గత ప్రభుత్వంలో ఆన్‌లైన్‌లో పేర్లు మార్చి దౌర్జన్యం చేస్తు న్నారని వివరించారు. వారి నుంచి తమ భూమిని విడిపించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు.
` తమకు వారసత్వంగా వచ్చి భూమిని ఆన్‌లైన్ చేసి పాస్ పుస్తకాలు ఇవ్వమంటే అధికారులు పట్టించుకోవడం లేదని అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం మాసా పేటకు చెందిన షేక్ సయ్యద్ బాషా ఫిర్యాదు చేశారు. తమ భూ సమస్యను పరిష్కరించాలని వినతిపత్రం ఇచ్చారు.
` 1988లో తమ తండ్రికి డి పట్టా భూమి ఇవ్వగా దానిని తమకు తెలియ కుండా మరొకరికి అక్రమంగా 1బీలో ఎక్కించారని అనంతపురం జిల్లా గార్ల దిన్నె మండలం మార్తాండు గ్రామానికి చెందిన వి.లక్ష్మి ఫిర్యాదు చేశారు. 2022లో జరిగిన ఈ అక్రమ ఆన్‌లైన్‌ను రద్దు చేసి తమ భూమి తమకు ఉండేలా చూడాలని కోరారు.