- వారి సంక్షేమంపై మాట్లాడే హక్కు మీకు లేదు
- తమ ప్రభుత్వంలో మెరుగైన సౌకర్యాలు
- రూ.143 కోట్లతో వసతిగృహాల్లో మరమ్మతులు
- మండలిలో మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి
అమరావతి(చైతన్యరథం): దళితులకు మేనమామ అంటూ జగన్‌రెడ్డి దగా చేశారని మండలిలో మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి మండిపడ్డారు. దళితుల సంక్షేమంపై మాట్లాడే హక్కు వారికి లేదని వ్యాఖ్యానించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ. 143 కోట్లతో వసతిగృహాల్లో మరమ్మతులు చేయిస్తున్నామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వసతిగృహాల్లో మరమ్మతులకు గత ఐదేళ్లలో ఖర్చు చేసింది కేవలం రూ.27 కోట్లు మాత్ర మేనని గుర్తుచేశారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరులో 210 మంది విద్యార్థులున్న హాస్టల్‌లో వైసీపీ అసమర్థత వల్ల 30 మందికి పడిపోయిందని తెలిపారు. దానిని రూ.30 లక్షలతో మరమ్మతులు చేసి ఆధునీకరించినట్లు చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని సంక్షేమ వసతిగృహాల్లో బీపీటీ బియ్యంతో విద్యార్థులకు భోజనం పెడతామని వివరించారు. పోస్టుమె ట్రిక్ విద్యార్థులకు చరిత్రలో మొదటిసారి కార్పెట్ బెడ్ షీట్లు, టవళ్లు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని తెలిపారు. విద్యార్థులకు మెరుగైన సౌక ర్యాలు, నాణ్యమైన విద్య, భోజనం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.